తెలంగాణలో దసరా సెలవులు తగ్గించండి, పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదన

Telangana SCERT Proposes to School Education Dept to Reduce Dussehra Holidays for Schools Across the State, State Council of Educational Research and Training, Telangana SCERT Proposes to Reduce Dussehra Holidays, Telangana SCERT, Telangana Dussehra Holidays , SCERT Proposes to Reduce Dussehra Holidays, Mango News, Mango News Telugu, SCERT, SCERT Latest News And Updates, Telangana School Education Dept, Telangana Latest News And Updates, SCERT News And Live Updates

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23 ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 14 రోజులు పాటుగా దసరా పండుగ సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విద్యార్థులకు దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి) ప్రతిపాదించింది. జూలైలో వర్షాలు కారణంగా సెలవులు ఇవ్వడంతో పాటుగా, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23 లో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, వాటిని భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ రెండు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది.

దసరా పండుగ సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు తగ్గించి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇస్తే ఐదు పనిదినాలు భర్తీ చేయొచ్చని లేదా 2022 నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేసేలా చేస్తే ఐదు రోజులు కలిసి వస్తాయని ఎస్‌సీఈఆర్‌టీ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచింది. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేనకు మంగళవారం ఒక లేఖ రాశారు. ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సమీక్ష అనంతరం ఏ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది, పాఠశాలలకు దసరా సెలవులు ఎన్ని రోజులనే దానిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − four =