బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై స్టే

Bombay High Court, Bombay High Court Directed BMC to Stop Demolition of Kangana Ranaut Office, Demolition of Kangana Ranaut Office, Demolition of Kangana Ranaut Office in Mumbai, Kangana Ranaut, Kangana Ranaut High Court hearing, Kangana Ranaut Office, Kangana Ranaut Office Demolition

ముంబయిలోని బాంద్రాలో గల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం నాడు కూల్చివేశారు. చట్ట విరుద్ధంగా, నిబంధనలు పాటించకుండా ఈ కార్యాలయాన్ని నిర్మించడంతోనే కొంత భాగాన్ని కూల్చివేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు. మరోవైపు కూల్చివేతపై కంగనా రనౌత్ ముంబయి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతను ఆపేయాలంటూ బీఎంసీకి కోర్టు ఆదేశాలు ఇస్తూ, ఈ అంశంపై అఫిడవిట్ ఫైల్ చేయాలనీ సూచించింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు వాయిదా వేసింది.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసుకు సంబంధించి జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో ముంబయి మరో పీవోకే అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. 9వ తేదీన ముంబయి వస్తానని, ఎవరూ అడ్డుకుంటారో చూస్తానంటూ కంగనా సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్రం తనకు కేటాయించిన వైప్లస్ సెక్యూరిటీతో కంగనా ఈ రోజు ముంబయికి బయలు దేరారు. మరికొద్దీ సేపట్లో ముంబయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eleven =