కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కుమారుడు ఎంపీ కార్తీకి సిబిఐ షాక్.. దేశవ్యాప్తంగా వారి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో రైడ్స్

CBI Searches at Multiple Locations Linked To Ex-Union Minister Chidambaram and His Son MP Karti, CBI Searches at Multiple Locations Linked To Ex-Union Minister Chidambaram, CBI Searches at Multiple Locations Linked To MP Karti, CBI searches multiple locations linked to Ex-Union Minister Chidambaram and His Son, CBI searches at Karti Chidambaram’s premises across cities, CBI searches at Ex-Union Minister Chidambaram premises across cities, Congress MP Karti Chidambaram's home and offices were searched today by the CBI, central agency is conducting searches at nine locations across several states linked to Karti Chidambaram, MP Karti gratification case, MP Karti gratification case News, MP Karti gratification case Latest News, MP Karti gratification case Latest Updates, MP Karti gratification case Live Updates, Former Union Minister Chidambaram, Ex-Union Minister Chidambaram, Union Minister Chidambaram, Chidambaram, Mango News, Mango News Telugu,

కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆయన కుమారుడికి సంబంధించిన ఇళ్ళు మరియు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ క్రమంలో చెన్నై, ముంబయి, ఒడిశా మరియు ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి మరియు ఆయన కుమారుడు, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపి కార్తీ చిదంబరానికి చెందిన బహుళ నివాస మరియు అధికారిక ప్రాంగణాలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కార్తీ చిదంబరం, అతని అసోసియేట్ భాస్కరరామన్ మరియు ఇతరులకు సంబంధించిన దాదాపు ఏడు ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

ముంబయి, చెన్నై, ఒడిశా, పంజాబ్‌, కర్నాటకలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు సంబంధించిన తొమ్మిది చోట్ల సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. చిదంబరం ఇంట్లో ఉన్న వ్యక్తుల వాంగ్మూలాలను కూడా సీబీఐ నమోదు చేస్తోంది. ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ఉన్న కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని ఓ ప్రాజెక్ట్‌లో పని చేసేందుకు కొంతమంది చైనా పౌరులకు వీసా కల్పించేందుకు కార్తీ అక్రమంగా రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

కార్తీ చిదంబరం తన తండ్రి పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ₹ 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించినందుకు INX మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (FIPB) క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో దర్యాప్తు సమయంలో, ఈ కేసును వెలికితీసే కొన్ని పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మే 15, 2017న ఈ వ్యవహారంపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఇదే కేసులో కార్తీ చిదంబరాన్ని 2018 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, మార్చిలో నెల రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =