ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వండి, మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి

TS Home Minister Mahmood Ali Conducted Meeting on Urdu Medium Training in Recruitment, TS Home Minister Mahmood Ali Conducted Meet on Urdu Medium Training in Recruitment, Meet on Urdu Medium Training in Recruitment, Urdu Medium Training in Recruitment, Minister Mahmood Ali Conducted Meeting on Urdu Medium Training in Recruitment, Home Minister Mahmood Ali Conducted Meeting on Urdu Medium Training in Recruitment, Mahmood Ali Conducted A High Level Meeting About TSPSC Urdu Medium, Telangana State Public Service Commission, TSPSC Urdu Medium, Urdu Medium Training Recruitment, TS Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali, Minister Mahmood Ali, TS Home Minister, Mahmood Ali, Urdu Medium Training Recruitment Latest News, Urdu Medium Training Recruitment Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాషలో శిక్షణ, సంబందిత మెటీరియల్ తయారీ వంటి అంశాలపై సోమవారం హోం మంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 80 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు లక్డీకాపూల్‌ లోని తన కార్యాలయంలో హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎకె ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, డైరెక్టర్ షానవాజ్ ఖాసిం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి ఒమర్ జలీల్, ప్రొఫెసర్ ఎస్. ఎ.షాకుర్, తెమ్రిస్ కార్యదర్శి షఫీ ఉల్ల్హ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షల్లో ఉర్దూ మెటీరియల్స్, స్టడీ సెంటర్ల వివరాలను అధికారుల నుంచి హోంమంత్రి తెలుసుకున్నారు.

అనంతరం హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇదో సువర్ణావకాశమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని, మార్కెట్‌లో ఇంగ్లీషు, తెలుగు కంటెంట్ పుష్కలంగా ఉందన్నారు. ఉర్దూ భాష కాబట్టి ఉర్దూ విద్యార్థులకు మెటీరియల్ అందించడం అనేది ఈ సమయంలో ముఖ్యమైన అవసరమని గుర్తు చేశారు. గ్రూపు 1, 2, 3 పరీక్షల్లో ఉర్దూ మెటీరియల్ అందించడం ఉర్దూ విద్యార్థులకు నిజమైన సేవలందించినట్లే.. ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి, డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. విద్యార్థులు తమ ప్రాంతంలోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (డీఎండబ్ల్యూఓ)ని సంప్రదించడం ద్వారా లేదా హైదరాబాద్‌లోని మైనారిటీ అధ్యయన కేంద్రానికి కాల్ చేయడం ద్వారా తమ పేరును 23 మే వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23236112 నంబర్‌కు ఫోన్ చేసి పేరు, చిరునామా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఉర్దూ మీడియం విద్యార్థులకు ఇది సువర్ణావకాశమని దీనికి సద్వినియోగం చేసుకోవాలని హోం మంత్రి తెలిపారు. ఉర్దూ విద్యార్థులు ఈ అవకాశాలను సీరియస్‌గా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా కృషి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెమ్రిస్ పాఠశాలల్లోని ప్రభుత్వ కోచింగ్ సెంటర్ల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్న భోజనం, టీ, నీళ్లు అందజేస్తుందని కార్యదర్శి షఫీవుల్లా తెలిపారు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లో మైనారిటీ కోచింగ్ సెంటర్లు ఏర్పాట్లు పూర్తి చేశాం, ఉర్దూ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు అని హోంమంత్రి మ‌హ్మ‌ద్ మ‌హ‌మూద్ అలీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =