ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం

Central Govt Appointed New Governors For Six States
Central Govt Appointed New Governors For Six States

ఇటీవలే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రప్రభుత్వం, ఈ రోజు మరో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించడం,ప్రస్తుతం పదవిలో ఉన్నవారికి, పరిస్థితులను బట్టి మరో రాష్ట్రానికి బదిలీ చేయడం వంటి అంశాలపై దృష్టి సారించింది.ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందిబెన్ పటేల్ ను ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా బదిలీ చేసారు. బీహార్ గవర్నర్ గా పదవిలో ఉన్న లాల్ జీ టాండన్ ను మధ్యప్రదేశ్ గవర్నరుగా నియమించారు. ఇక బీహార్ గవర్నరుగా ఫగు చౌహన్, పశ్చిమబెంగాల్ గవర్నరుగా జగదీప్ ధన్‌కర్, త్రిపుర గవర్నరుగా రమేష్ బయాస్, నాగాలాండ్ గవర్నరుగా ఆర్ఎన్ రవి లను కేంద్రప్రభుత్వం నియమించింది. త్వరలోనే కొత్తగా ఎంపికైన గవర్నర్లు ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=k6nelt5neWY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =