ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

#SheilaDikshit, Ex-Delhi CM Sheila Dikshit Demise, Former Delhi CM and Congress Leader Sheila Dikshit Passes Away at 81, Former Delhi CM Sheila Dikshit Passed Away at 81, Mango News, RIP Sheila Dikshit, Sheila Dikshit Latest Updates

ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్ను మూసారు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ శనివారం నాడు శ్వాస విడిచారు. 1938, మార్చి 31 న పంజాబ్ లో షీలా దీక్షిత్ జన్మించారు, ఆమె వయసు 81 సంవత్సరాలు. 1998 నుండి 2013 వరకు మూడు పర్యాయాలపాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా అనేక సేవలందించారు.

షీలా దీక్షిత్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించారు. ఢిల్లీకి అత్యధికకాలం పాటు సీఎంగా పనిచేసి గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదుకున్న ఆమె, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి క్రియాశీలక పాత్ర పోషించారు. 2014లో ఆమెను యూపీఏ ప్రభుత్వం కేరళ గవర్నర్ గా నియమించగా, ప్రభుత్వం మారి ఎన్డిఏ అధికారంలోకి రావడంలో వెంటనే రాజీనామా చేసారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=B_Pl7M7w-O8]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 7 =