దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్‌ కేసుల నేపథ్యంలో.. భారత్‌ బయోటెక్‌ ‘నేసల్ వ్యాక్సిన్‌’కు కేంద్రం ఆమోదం

Centre Approves Bharat Biotech's Intranasal Vaccine For Covid-19 Amid New Variant Omicron BF.7 Cases,Covid New Variant Cases,Bharat Biotech Nasal Vaccine,Centre Approved Nasal Vaccine,Mango News,Mango News Telugu,Bharat Biotech Nasal Vaccine Availability,When Will Nasal Vaccine Be Available,Bharat Biotech Nasal Vaccine Name,Nasal Vaccine Covid Bharat Biotech,Bharat Biotech Nasal Vaccine Phase 3,Nasal Vaccine Bharat Biotech Launch Date,Bharat Biotech Nasal Vaccine Efficacy,Nasal Vaccine Covid 19,Bharat Biotech Nasal Vaccine Phase 2,Bharat Biotech Nasal Vaccine Launch Date In India,Bharat Biotech Nasal Vaccine Phase 1,Bharat Biotech Nasal Vaccine Trial Result,Bharat Biotech Nasal Vaccines Awaiting Regulatory Approval,Nasal Vaccine Bharat Biotech,Bharat Biotech Nasal Vaccines,List Of Nasal Vaccines,Nasal Administration Vaccines,Nasal And Inhaled Vaccines,Nasal Covid 19 Vaccines,Nasal Covid Vaccine Name,Nasal Covid Vaccines,Nasal Delivery Of Vaccines,Nasal Flu Vaccines,Nasal Spray Vaccines,Nasal Spray Vaccines Covid,Nasal Spray Vaccines For Covid 19,Nasal Vaccine Bharat Biotech Launch Date,Nasal Vaccine Examples,Nasal Vaccine India,Nasal Vaccine Update,Nasal Vaccines,Nasal Vaccines For Covid,Nasal Vaccines For Covid 19,Nasal Vaccines For Covid-19

చైనాలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే 4 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులో వెలుగు చూసిన క్రమంలో గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మండవియా పార్లమెంట్ వేదికగా పలు కీలక సూచనలు చేశారు. అలాగే ప్రధాని మోదీ అధ్యక్షతన చాలా రోజుల తర్వాత కోవిడ్ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన ‘భారత్‌ బయోటెక్‌’ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకా (ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌) కు ఆమోదం తెలిపింది.

ఈ మేరకు కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్న వారు దీనిని ‘హెటిరోలాగస్‌ బూస్టర్‌’గా తీసుకోవచ్చని సూచించింది. అయితే ప్రస్తుతం ఇది ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందని, 18 ఏళ్ల దాటిన వారు దీనిని ఉపయోగించుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా ఈ ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇవ్వగా.. కేంద్రం దీనికి ఇప్పుడు ఆమోదం తెలిపింది. దేశంలో మళ్ళీ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 13 =