ఐపీఎల్-2023 వేలం: రూ.18.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ కు సామ్ కుర్రాన్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర

IPL 2023 Auction Live Updates: Sam Curran Becomes Most Expensive Player in IPL Punjab Kings Gets him for Rs 18.50 Cr,Ipl-2023 Auction, Sam Curran To Punjab Kings,Rs 18.50 Crore Highest Price In Ipl History,Mango News,Mango News Telugu,Cricbuzz Ipl Auction 2023,Ipl 2022,Ipl 2022 Auction Price List,Ipl 2022 Players Price List,Ipl Auction 2022,Ipl Auction 2023 Csk,Ipl Auction 2023 Date,Ipl Auction 2023 Date And Time,Ipl Auction 2023 Date Players List,Ipl Auction 2023 Live,Ipl Auction 2023 Players List,Ipl Auction 2023 Players List With Price,Ipl Auction 2023 Rcb,Ipl Auction 2023 Rules,Ipl Auction 2023 Sold Players List,Ipl Media Rights Auction 2023,Ipl Mega Auction 2023,Ipl Mega Auction 2023 Date,Ipl Mini Auction 2023,Ipl Mini Auction 2023 Date,Ipl Mini Auction 2023 Date And Time,Ipl Mini Auction 2023 Players List,Ipl Next Auction 2023,Ipl Player Auction 2023,Mini Ipl Auction 2023,Mini Ipl Auction 2023 Date,Next Ipl Auction 2023,Next Ipl Auction 2023 Date,Players Available For Ipl Auction 2023,Tata Ipl Auction 2023 Date,Top Players In Ipl Auction 2023

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2023 సీజన్‌ కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ నేడు (డిసెంబర్ 23, శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి కేరళలోని కొచ్చిలో ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 405 మంది క్రికెటర్లలో 273 మంది భారత్, 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళలో 119 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 282 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు నలుగురు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. అదేవిధంగా ఐపీఎల్‌ 2023 సీజన్ కోసం ప్రస్తుతం 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 87 మంది క్రికెటర్లను (విదేశీ ఆటగాళ్లు 30 మందితో కలిపి) మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

కాగా ఈ ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ రూ.18.50 కోట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సామ్ కుర్రాన్ నిలిచాడు. సామ్ కుర్రాన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా రూ.18.50 కోట్లుకు పంజాబ్ కింగ్స్‌ జట్టు దక్కించుకుంది. ముందుగా వేలంలో సామ్ కుర్రాన్ కోసం ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ పోటీలో ఉండగా, చివర్లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్‌ జెయింట్స్ సామ్ కుర్రాన్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి.

ముంబయి ఇండియన్స్ రూ.16.75 కోట్ల వరకు పోటీలో ఉండగా, చివరికి పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.18.50 కోట్లతో సామ్ కుర్రాన్ ను దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాళ్లుగా ఇప్పటివరకు విరాట్ కోహ్లీ (రూ.17 కోట్లు), కేఎల్ రాహుల్ (రూ.17 కోట్లు) నిలవగా, తాజాగా మొదటి స్థానాన్ని సామ్ కుర్రాన్ సొంతం చేసుకున్నాడు.

అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ మరియు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పురాన్ కూడా రికార్డ్ బ్రేకింగ్ ధరలు పొందారు. కామెరాన్ గ్రీన్ ను ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లుతో దక్కించుకోగా, బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు దక్కించుకుంది. ఇక నికోలస్ పురాన్ ను రూ.16.00 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 వేలంలో ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు అధిక ధరలు పొందడం విశేషం. మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు, భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 18 =