దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జనవరి 29 న తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే పేలుడుకు గల కారణాలు కనుగొనేందుకు కేంద్రం ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ పేలుడుపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) అప్పగించినట్లుగా కేంద్ర హోం శాఖ మంగళవారం నాడు వెల్లడించింది. మరోవైపు ఈ పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య విలువైన భద్రతా సహకారం కొనసాగుతుందని చెప్పారు. అలాగే కోవిడ్-19 నేపథ్యంలో హెల్త్ కేర్ సహకారం గురించి కూడా చర్చించామని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ