రాబోయే పండుగల ముందు నైట్ కర్ఫ్యూ పెట్టండి, ఒమిక్రాన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

Coronavirus, Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, COVID-19, COVID-19 Cases in India, covid-19 new variant, India Omicron Cases, India Reports 6563 Covid-19 Cases in Last 24 Hours, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, , Omicron Cases In India, Omicron covid variant, Omicron variant, Update on Omicron

దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిస్తున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధతపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు మరియు ఎన్హెఛ్ఎం ఎండీలతో కోవిడ్-19 మరియు ఓమిక్రాన్ వేరియంట్‌ తో పోరాడటానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పెద్దఎత్తున కేసులు పెరుగుతుండడంతో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. కరోనా పరీక్ష పాజిటివ్ రేటు 10% మించి పెరిగినప్పుడు లేదా ఆక్సిజనేటెడ్ బెడ్‌ల ఆక్యుపెన్సీ 40% మించి పెరిగినప్పుడు జిల్లా, స్థానిక పరిపాలన ద్వారా కంటైన్మెంట్ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒమిక్రాన్ ముప్పును ఎదుర్కోవడానికి 5 ఫోల్డ్ స్ట్రాటజీ అమలు చేయాలన్నారు.

1.కంటైన్మెంట్ పై రాష్ట్రాలకు సూచనలు:

  • ముఖ్యంగా రాబోయే పండుగల ముందు రాత్రిపూట కర్ఫ్యూలను విధించడం మరియు పెద్ద పెద్ద సమావేశాలపై కఠినమైన నియంత్రణను అమలు చేయాలి.
  • కొత్త క్లస్టర్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నట్లయితే, కంటైన్‌మెంట్ జోన్‌లు, బఫర్ జోన్‌లు వెంటనే ప్రకటించాలి.
  • అన్ని క్లస్టర్ లలో నమోదైన పాజిటివ్ నమూనాలను ఎలాంటి ఆలస్యం లేకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సకాగ్ ల్యాబ్‌లకు పంపాలి.

2.కరోనా పరీక్షలు :

  • అన్ని జిల్లాల్లోని డెల్టా మరియు ఒమిక్రాన్ కేసుల సంఖ్యను నిశితంగా, కఠినంగా పర్యవేక్షించాలి.
  • రోజు వారీగా మరియు వారం వారీగా కరోనా పాజిటివ్ రేటు, రెట్టింపు రేటు, కొత్తగా క్లస్టర్స్ ఆధారంగా కంటైన్మెంట్ ను ప్రారంభించాలి.
  • ప్రస్తుతం ఉన్న ఐసీఎంఆర్ మరియు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను నిర్వహించాలి.
  • కంటైన్మెంట్ ఏరియాల్లో డోర్-టు-డోర్ కేస్ సెర్చ్‌ చేయాలి.
  • కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు వారికి సకాలంలో పరీక్షలు చేయాలి.
  • అంతర్జాతీయ ప్రయాణీకులను పర్యవేక్షించడానికి “ఎయిర్ సువిధ” పోర్టల్‌ యాక్సెస్‌ని ఉపయోగించుకోవాలి.

3.క్లినికల్ మేనేజ్‌మెంట్‌ :

  • ఒమిక్రాన్ కోసం ప్రస్తుతం ఉన్న నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ లో ఎలాంటి మార్పు ఉండదు.
  • బెడ్ కెపాసిటీని పెంచడం, అంబులెన్స్‌ల వంటి లాజిస్టిక్స్‌ని పెంచుకోవాలి.
  • ఆక్సిజన్ పరికరాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించుకోవాలి.
  • కనీసం 30 రోజుల పాటు అవసరమైన ఔషధాల బఫర్ స్టాక్‌ను ఏర్పాటుచేసుకోవాలి.
  • ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం హోమ్ క్వారంటైన్ /ఐసోలేషన్‌ను కఠినంగా అమలు చేయాలి.
  • కోవిడ్ కేసుల సంఖ్య పెరిగినట్లయితే వైద్యులు మరియు అంబులెన్స్‌ల సహా ఇతర కార్యాచరణ కోసం ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవాలి.

4.కోవిడ్ సేఫ్ బిహేవియర్:

  • ముందస్తు పరిశీలన మరియు సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. తద్వారా తప్పుడు సమాచారం లేదా భయాందోళనలు ఉండకుండా చూసుకోవాలి.
  • హాస్పిటల్ మరియు టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లభ్యతపై పారదర్శకంగా కమ్యూనికేట్ చేయాలి.
  • క్రమం తప్పకుండా ప్రెస్ బ్రీఫింగ్‌లు నిర్వహించాలి.
  • కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి మరియు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి.

5.వ్యాక్సినేషన్ :

  • మొదటి మరియు రెండవ డోస్ అర్హతగల లబ్ధిదారులకు 100% కవరేజీని వేగవంతమైన పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి.
  • జాతీయ సగటు కంటే మొదటి మరియు రెండవ డోస్ కవరేజీ తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • వ్యాక్సినేషన్ కవరేజీ జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత లలో ప్రత్యేకంగా ఇంటింటికి వ్యాక్సినేషన్ ప్రచారాన్ని బలోపేతం చేయాలి.
  • సమీప భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్తున్న రాష్ట్రాలు వ్యాక్సినేషన్ వేగం పెంచడంతో పాటుగా, తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలి.
  • తక్కువ వ్యాక్సినేషన్ కవరేజ్ ఉన్న ప్రాంతాలు మరియు తక్కువ కోవిడ్ ఎక్స్‌పోజర్ ఉన్న ప్రాంతాల్లో కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ మరింత హాని కలిగించవచ్చు. ఈ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ను పెంచడానికి రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =