ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూత

Ajit Jogi, Ajit Jogi Passed Away, Chhattisgarh Former Chief Minister, Chhattisgarh Former Chief Minister Ajit Jogi, Chhattisgarh Former Chief Minister Ajit Jogi Dies, Chhattisgarh Former Chief Minister Ajit Jogi Dies at 74, Chhattisgarh Former Chief Minister Passed Away, first chief minister of Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్ ‌జోగి మే 29, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి తోలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2000-2003 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు.

2016లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికొచ్చి జేసీసీ అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. అలాగే రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు మరియు రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌ 29, 1946న బిలాస్‌పూర్‌లో అజిత్‌ జోగి జన్మించారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి ఐఏఎస్ గా ఎంపికై 1981-85 ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌గా కూడా సేవలందించారు. అజిత్ జోగి మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here