ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. కోవిడ్-19 నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు

CM YS Jagan Orders Officials To Control Covid-19 During Review Over Corona Situation in AP,BF7 Variant Cases,BF7 Variant Latest News and Updates,Omicron BF7 Symptoms,Mango News,Mango News Telugu,BF7 Variant Symptoms,BF7 Variant Severity,Omicron BF7 In India,BF7 Covid Variant,Ba 5 1 7 Variant,Omicron New Variant,Omicron New Variant In India,Omicron Bf.7 Symptoms,Bf.7 Variant Severity,Omicron Bf.7 In India,Ba 5.1 7 Variant,Bf.7 Variant,BF7 Variant In India,Bf.7 Variant Covid,Bf.7 Variant Cdc,Bf.7 Variant Canada,Bf.7 Variant Uk,Bf.7 Variant Belgium,Bf.7 Variant Mutations,Covid BF7 Variant,Omicron BF7 Variant,Covid BF7 Variant Symptoms

దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను సూచించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా కరోనా పరిస్థితులపై చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, సీఎస్ జవహర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్, కోవిడ్-19 నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

కోవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. టెస్టింగ్ మరియు మెడికేషన్ ప్రక్రియలపై దృష్టి పెట్టాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయడం ద్వారా దీనిపై స్పష్టమైన అవగాహన ఉంటుందని, దీనికోసం ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందిని వినియోగించుకోవాలని చెప్పారు. ఇక సిబ్బందికి అదనంగా మాస్కులు, పీపీఈ కిట్లు వంటివి అందుబాటులో ఉంచాలని సూచించారు. విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటైన నేపథ్యంలో టెస్టుల ఫలితాలు వెంటనే విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని, ఆక్సిజన్ స్థాయిలు సరిపడా నిల్వ ఉంచుకోవాలని సీఎం జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =