భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్.. ప్రతిపాదించిన సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana Recommends Centre The Name of Supreme Court Justice UU Lalit as His Successor, NV Ramana Recommends Centre The Name of Supreme Court Justice UU Lalit as His Successor, CJI NV Ramana Says Name of Supreme Court Justice UU Lalit as His Successor, Name of Supreme Court Justice UU Lalit as His Successor, CJI NV Ramana has personally handed over a copy of his letter of recommendation, NV Ramana recommended to the government the name of Justice Uday Umesh Lalit as his successor, name of Justice Uday Umesh Lalit as his successor, Justice UU Lalit who is in line to become the 49th Chief Justice of India, 49th Chief Justice of India, Justice UU Lalit, Chief Justice of India NV Ramana, CJI NV Ramana, Chief Justice of India, Justice UU Lalit News, Justice UU Lalit Latest News, Justice UU Lalit Latest Updates, Justice UU Lalit Live Updates, Mango News, Mango News Telugu,

భారత తదుపరి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ పేరును కేంద్రానికి సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ఇక దీనికి ఆమోద ముద్ర కోసం సీజేఐ లేఖను న్యాయశాఖ కేంద్రానికి పంపనుంది. కాగా ఏప్రిల్ 24, 2021న ఎస్ఏ బాబ్డే నుండి 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ, 16 నెలల పదవీకాలం తర్వాత ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు.

ఈ క్రమంలో ఆగస్ట్ 27వ తేదీన జస్టిస్ యు.యు. లలిత్ భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే జస్టిస్ లలిత్ ఈ ఏడాది నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయనుండటంతో.. భారత ప్రధాన న్యాయమూర్తిగా మూడు నెలల కంటే తక్కువ పదవీకాలం మాత్రమే పదవిలో ఉండనున్నారు. కాగా సంప్రదాయం ప్రకారం తన తర్వాత పదవిని చేపట్టేందుకు సుప్రీం కోర్ట్ లోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీజేఐ ఎన్వీ రమణ తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ యు.యు. లలిత్ పేరుని సూచించడం జరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =