హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Inaugurates Telangana State Police Integrated Command Control Centre in Hyderabad Today, Telangana CM KCR Inaugurates Telangana State Police Integrated Command Control Centre in Hyderabad Today, KCR Inaugurates Telangana State Police Integrated Command Control Centre in Hyderabad Today, Telangana CM KCR Starts Telangana State Police Integrated Command Control Centre in Hyderabad Today, KCR Inaugurated Telangana State Police Integrated Command Control Centre in Hyderabad Today, Telangana State Police Integrated Command Control Centre in Hyderabad, Telangana State Police Integrated Command Control Centre, Police Integrated Command Control Centre, Command Control Centre, police command control Centre, Police Command and Control Centre at Banjara Hills, Banjara Hills Police Command and Control Centre, Police Command and Control Centre, iconic Integrated Command and Control Centre at Banjara Hills, New Police Command and Control Centre at Banjara Hills, Hyderabad Police Commissionerate, Banjara Hills, Police Command and Control Centre News, Police Command and Control Centre Latest News, Police Command and Control Centre Latest Updates, Police Command and Control Centre Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. ముందుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ శిలాఫలకం వద్ద పూజలు చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, సీపీ సీవీ ఆనంద్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కాగా అత్యాధునిక టెక్నాలజీతో సుమారు 7 ఎకరాలలో 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 600 కోట్ల రూపాయల వ్యయంతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలని ఈ సీసీసీకి అనుసంధానం చేశారు. పది లక్షల కెమెరాల అనుసంధానంతో.. రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో కనిపెట్టి అక్కడి పోలీసు అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ భవనం నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించారు.

ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానంలో నగర కమిషనరేట్‌ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ బ్రాంచ్‌.. ఇలా అన్ని విభాగాలనూ ఇక్కడ ఒకేచోట ఏర్పాటు చేశారు. బిల్డింగ్‌ చుట్టూ 35 శాతం గ్రీనరీ, 600 వాహనాలు పార్కింగ్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు. నిరంతర ఎలక్ట్రిసిటీ సరఫరా కోసం ప్రతి ఫ్లోర్‌కు సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 5 టవర్లు (ఏ,బీ,సీ,డీ,ఈ) నిర్మించారు. టవర్‌ ఏ లోని ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. 14, 15వ ఫ్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. అలాగే 18వ ఫ్లోర్‌లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఉంది. ఇక టవర్‌ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు. డయల్ 100, షీ టీమ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైం కార్యాలయాలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twelve =