కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022: భారత్ మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ

Commonwealth Games-2022 BCCI Announced Team India Senior Women Squad, BCCI Announced Team India Senior Women Squad, Team India Senior Women Squad, Commonwealth Games-2022, 2022 Commonwealth Games, Commonwealth Games, Team India Senior women's cricket squad for 2022 Commonwealth Games, women's cricket squad for 2022 Commonwealth Games, BCCI Announced announces women’s cricket team for Birmingham 2022, Birmingham Commonwealth Games 2022, All-India Women's Selection Committee, Team India Senior Women Squad for the forthcoming 2022 Commonwealth Games in Birmingham, 2022 Commonwealth Games in Birmingham, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు 2022 కామన్‌ వెల్త్ గేమ్స్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 కోసం టీమ్ ఇండియా (సీనియర్ ఉమెన్) జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్-2022 గేమ్స్ కోసం భారత్ మహిళా జట్టును ఎంపిక చేసేందుకు ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ కమిటీ సోమవారం సమావేశమై 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. భారత్ మహిళా జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన సబ్బినేని మేఘనకు చోటు లభించింది.

కాగా మలేషియాలోని కౌలాలంపూర్‌లో 1998 కామన్‌వెల్త్ గేమ్స్‌లో లిస్ట్-ఏ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ జరిగిన తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో మళ్ళీ క్రికెట్‌ను చేర్చడం ఇదే తొలిసారి. అలాగే ఈసారి కేవలం మహిళల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో ఆడబడతాయని పేర్కొన్నారు.

కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, బార్బడోస్ లతో భారత్ జట్టు గ్రూప్-ఎలో ఉంది. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా గ్రూప్-బి లో ఉన్నాయి. గ్రూప్-ఎ, గ్రూప్-బి నుండి మొదటి స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. టోర్నమెంట్ లీగ్ దశలో జూలై 29న ఆస్ట్రేలియాతో, జూలై 31న పాకిస్తాన్ తో, ఆగస్టు 3న బార్బడోస్ తో భారత్ జట్టు మూడు గేమ్‌లు ఆడాల్సి ఉంది.

భారత్ మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తనియా సప్నా భాటియా (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాజేశ్వరి గయక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్ , జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రానా.

స్టాండ్‌బై ప్లేయర్స్ : సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + three =