కరోనా ఆంక్షలు: ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ జనవరి 1 వరకు పొడిగింపు

Punjab Government Extends Night Curfew Till January 1st,Punjab Government Extends Night,Punjab Government,Night Curfew,Punjab Government Extends Night Curfew,Punjab,Punjab Extends Night Curfew Till January 1,Coronavirus,Punjab Govt Extends Night Curfew Across The State Till 1 Jan,Mango News,Mango News Telugu,Night Curfew,Punjab Night Curfew,Punjab Night Curfew News,Punjab Night Curfew Update,Punjab Night Curfew Today,Punjab Night Curfew Rules,Punjab Night Curfew Guidelines,Night Curfew In Punjab Today,Night Curfew In Punjab,Night Curfew In Punjab Latest News,Night Curfew In Punjab Hindi,Night Curfew In Punjab News,Night Curfew News,Night Curfew News Today,Punjab Curfew News Today,Punjab Curfew News Latest

కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సమీక్ష జరిపి రాత్రి పూట కర్ఫ్యూను జనవరి 1 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్‌ ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రజలు గుంపులుగా గుమిగూడాన్ని కూడా నిషేధించారు. ముఖ్యంగా వివాహ వేడుకల్లో ప్రజలు గుంపుగా చేరడంపై పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇటీవల రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను భారీగా ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. వివాహ మరియు ఇతర సమావేశాలకు సంబంధించి ఇండోర్ హాల్స్ లో గరిష్టంగా 100 మంది, అవుట్ డోర్ లో 250 మందిని అనుమతించాలని చెప్పారు. నిబంధనలను పాటించకపోతే జరిమానాలు విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ లో డిసెంబర్ 10 నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,556 కి చేరింది. 1,46,126 మంది కోలుకోగా, ప్రస్తుతం 7,423 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వలన పంజాబ్ లో ఇప్పటికి 5,007 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nineteen =