కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022: భారత్ కు మొత్తం 61 పతకాలు, చివరిరోజు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం

Commonwealth Games-2022 India Ends Campaign at 4th Spot with 61 Medals, India Ends Campaign at 4th Spot with 61 Medals In Commonwealth Games-2022, India Spot with 61 Medals In Commonwealth Games-2022, India Ends Campaign at Commonwealth Games-2022, India finished their Birmingham Commonwealth Games campaign, indian medals in 2022 commonwealth games, 22 gold Medals, 16 silver Medals, 23 bronze Medals, CWG-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో చివరిరోజైన సోమవారం కూడా భారత్ అథ్లెట్స్ అద్భుత ప్రదర్శన చేశారు. సోమవారం మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ లో లక్ష్యసేన్‌, పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి జోడీ, పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ లో శరత్‌ కమల్‌ గొప్ప ప్రదర్శన చేసి స్వర్ణ పతకాలు గెలుపొందారు. భారత్ టేబుల్ టెన్నిస్‌ ఆటగాడు శరత్‌ కమల్‌ కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో మొత్తం 13 పతకాలు గెలుచుకోగా, ఈ ఎడిషన్‌లోనే 4 పతకాలు(స్వర్ణం-పురుషుల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల టీమ్, రజతం-పురుషుల డబుల్స్) గెలుచుకున్నాడు.

ఇక పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ కాంస్యపతక పోరుతో ఇంగ్లాండ్‌ ఆటగాడు పాల్‌ డ్రింక్‌హాల్‌ ను 4-3తో ఓడించి సాథియాన్ జ్ఞానశేఖరన్‌ పతకం సాధించాడు. సాథియాన్ కు ఇదే తోలి కామన్‌ వెల్త్ గేమ్స్‌ పతకం. అలాగే పురుషుల హాకీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు తన ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆస్ట్రేలియా జట్టు భారత్‌ ను 7-0తో ఓడించింది. దీంతో భారత్‌ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో 1998లో హాకీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ పురుషుల జట్టు ఇంతవరకు ఎప్పుడూ స్వర్ణం గెలవలేదు. గతంలో 2010, 2014 ఎడిషన్లలో రజత పతకాలను గెలుచుకుంది. ఇక సోమవారంతో కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 ముగియనున్నాయి. ఈసారి గేమ్స్ లో భారత్ మొత్తం 61 పతకాలు (22 స్వర్ణ, 16 రజతం, 23 కాంస్యం) కైవసం చేసుకుని, ర్యాంకింగ్స్ లో భారత్ 4వ స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =