నేడు భారత్ బంద్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులకు నిరసన

All India Traders, All India Traders has Called for Nationwide Strike, All India Traders has Called for Nationwide Strike Today, All India Traders Strike, As traders call for nationwide strike, Bharat Bandh, Bharat Bandh Live News, Bharat Bandh Live Updates, Confederation of All India Traders, Confederation of All India Traders Nationwide Strike, Confederation of All India Traders Nationwide Strike Today, Mango News, Traders call for a nationwide strike

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు “భారత్ బంద్” కు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, జీఎస్టీ మార్పులు, కొత్త ఇ-వే బిల్లుకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నారు. అలాగే దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు ఒకేవిధంగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. నేడు దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లను మూసివేయాలని, ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయవద్దని సీఏఐటీ విజ్ఞప్తి చేసింది.

అలాగే ఈ-వే బిల్లులో మార్పులు మరియు ఇంధన ధరలు నిరంతరం పెరగడాన్ని వ్యతిరేకిస్తూ ఇతర రవాణా సంస్థలు కూడా బంద్ లో పాల్గొని నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధం అయ్యాయి. లారీ యజమానుల సంఘం, అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం, అన్ని రాష్ట్రాల్లోని వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్ లో చేరాలని నిర్ణయించాయి. ఈ బంద్ లో భాగంగా దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో 40 వేల ట్రేడ్ యూనియన్లకు చెందిన సుమారు 8 కోట్ల మంది వ్యాపారులు, కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపనున్నట్టు ప్రకటించారు. భారత్ బంద్‌ నేపథ్యంలో నేడు వస్తువులు, ఇతర సేవల రవాణా నిలిచిపోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 5 =