కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం

Congress Presidencial Elections Senior Leader Mallikarjun Kharge Elected as New Congress President, Congress Presidencial Elections, Indian National Congress New President, Mallikarjun Kharge New President, Indian National Congress New President Mallikarjun Kharge, Mango News, Mango News Telugu, Congress President Election, Sonia Gandhi Rahul Priyanka Voted , Candidates Kharge Sashi Tharoor,Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Mallikarjun Kharge

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. ముందుగా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరగగా, నేడు (అక్టోబర్ 19, బుధవారం) కౌంటింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి, కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ శశి థరూర్ పై 6825 ఓట్ల తేడాతో మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9,835 ఓట్లు పోల్ అవగా, మల్లిఖార్జున్ ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదని పార్టీ ఎన్నికల విభాగం రిటర్నింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. మెజారిటీ ఓట్లు సాధించిన మల్లికార్జున్ ఖర్గే ను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్టు మధుసూదన్ మిస్త్రీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి మాత్రమే కాగా, 24 ఏళ్లకి సీతారామ్ కేస‌రి తర్వాత మళ్ళీ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి అయిన మల్లిఖార్జున్ ఖార్గే పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అలాగే జగ్జీవన్ రామ్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన రెండో దళిత నేతగా మరియు నిజలింగప్ప తర్వాత కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన రెండో నేతగా ఖర్గే గుర్తింపు పొందారు.

మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అభినందనలు తెలుపుతూ, శశి థరూర్ ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ రాశారు. కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉండటం గొప్ప గౌరవం మరియు పెద్ద బాధ్యత అని, ఖర్గే జీ ఆ పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని శశి థరూర్ పేర్కొన్నారు. అలాగే వెయ్యి మందికి పైగా సహచరుల మద్దతును పొందడం మరియు భారతదేశం అంతటా అనేక మంది కాంగ్రెస్ శ్రేయోభిలాషుల ఆశలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడాన్ని ఒక విశేషంగా భావిస్తున్నానని శశి థరూర్ అన్నారు.ఈ అధ్యక్ష ఎన్నికలు తటస్థంగా జరిగేలా చూసిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి శశి థరూర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక దీపావళి పండుగ అనంతరం ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తుంది. భారత్ జోడో యాత్రకి బ్రేక్ ఇచ్చి ఖర్గే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + twelve =