కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, తెలంగాణ, యూపీ ఓట్లపై అనుమానాలు – శశిథరూర్ సంచలన ఆరోపణలు

Congress Presidential Candidate Shashi Tharoor Alleges Rigging in Election, Shashi Tharoor Alleges Rigging in AICC Election, Congress President Election 2022, Congress President Election Counting of Votes Begins, Congress President Election Results, Mango News, Mango News Telugu, Congress President Election, Sonia Gandhi Rahul Priyanka Voted , Candidates Kharge Sashi Tharoor,Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Mallikarjun Kharge

కాంగ్రెస్​ అధ్యక్ష అభ్యర్థి, ఎంపీ శశిథరూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బుధవారం కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత థరూర్ బృందం ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్​ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్​ మధుసూదన మిస్త్రీకి థరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్​గా ఉన్న సల్మాన్​ సోజ్​​ లేఖ రాశారు. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్​లో పోలైన ఓట్లపై పలు అనుమానాలున్నాయని, వాటిని చెల్లుబాటు కానివిగా పరిగణించాలని లేఖలో కోరారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో చాలా తీవ్రమైన అవకతవకలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నామని, ఇక్కడ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత మరియు సమగ్రత లేకుండా జరిగిందని ఆరోపించారు. ఇక్కడ బ్యాలెట్ బాక్సులకు అనధికారిక ముద్రలు వేయడం, పోలింగ్ బూత్‌లలో అనధికారిక వ్యక్తుల ఉనికి, ఓటింగ్ దుర్వినియోగం వంటి అనేక సమస్యలను గుర్తించామని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =