సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్

Congress Presidential Candidate Shashi Tharoor Sensational Comments on Kharge Supporters, Congress Presidential Candidate Shashi Tharoor, Shashi Tharoor Comments on Kharge Supporters, Congress Presidential Candidate Shashi, Mango News, Mango News Telugu, Shashi Tharoor Congress, Shashi Tharoor Member of the Lok Sabha, Shashi Tharoor Chairperson Of Parliamentary Panel, Mallikarjun Kharge Congress Presidential Candidate , Mallikarjun Kharge, Shashi Tharoor Latest News And Updates, Mallikarjun Kharge Twitter Live Updates,

కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీ ప్రదేశ్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి సభ్యుల మద్దతు కోరారు. ఈ సందర్భంగా శశిథరూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని, దీని కారణంగా త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నిక నిస్పక్షపాతంగా జరిగే అవకాశాలను సంక్లిష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. తన ఎన్నికల ప్రత్యర్థి మల్లికార్జున్ ఖర్గేకు మద్దతుగా కొందరు నాయకులు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారని, ఆయనకు అనుకూలంగా సమావేశాలు కూడా పెట్టారని, కానీ తన విషయంలో మాత్రం అలా జరగడం లేదని శశిథరూర్ విచారం వ్యక్తం చేశారు.

అనేక రాష్ట్రాలలో పీసీసీ చీఫ్‌లు మరియు సీనియర్ నాయకులు తమ రాష్ట్రాల పర్యటనల సమయంలో తనతో సమావేశానికి అందుబాటులోకి రాలేదని, అయితే ఖర్గే పర్యటనల సమయంలో మాత్రం వారు దగ్గరుండి అందరి మద్దతు కోసం ప్రయత్నం చేశారని థరూర్ వెల్లడించారు. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని, పార్టీలో వినూత్న ఆలోచనలతో స్పష్టమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష బరిలో దిగినట్లు శశిథరూర్ వివరించారు. గత 22 ఏళ్లుగా పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఎన్నికలు జరగనందున పార్టీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని ఓటర్లను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతాయని భావిస్తున్నానని, ఖర్గేతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని శశిథరూర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =