మునుగోడు ఉప ఎన్నిక: ఈసీని కలిసిన తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ బృందం, ఓటర్ల జాబితాపై ఫిర్యాదు

Munugode By-poll Telangana BJP Incharge Tarun Chugh Led State Leaders To Complaint EC on New Voter List, BJP Incharge Tarun Chugh , Tarun Chugh Led State Leaders To Complaint EC, Munugode By-poll New Voter List, Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు విజయానికి గల అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడు పరిధిలో కొత్తగా నమోదైన ఓట్లపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ, తాజాగా ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ నేతృత్వంలో మురళీధరన్, రామచంద్రరావు తదితరులు కొత్త ఓటర్ల జాబితాపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఓటర్ల జాబితాలో కూడా అవకతవకలున్నాయని వారు ఈసీకి తెలిపారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో అతి తక్కువ వ్యవధిలో 25 వేల కొత్త ఓట్లు నమోదయ్యాయని, దీనిలో అధికశాతం బోగస్ ఓట్లు ఉండేందుకు అవకాశం ఉందని ఈసీకి తెలియజేశామని అన్నారు. దీనిపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున కోరామని తరుణ్ చుగ్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =