లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సందు దొరికినప్పుడల్లా..కాదు కాదు సందు చూసుకుని మరీ టీఎంసీ మీదా మమతా బెనర్జీ మీదా విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా మళ్లీ ఆయన మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. తన మేనల్లుడు విషయానికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతానని మమత చెప్పారని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే చౌదరి చేసిన ఈ సెటైరిక్ వ్యాఖ్యలతో కూటమిలో చీలిక ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవేం రాజకీయాలో.. అటు పొత్తు పెట్టుకుంటూనే ఇటు చిత్తుగా తిట్టుకుంటున్నారంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బొగ్గు కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులో .. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ సహా దర్యాప్తు సంస్థలు చాలాసార్లు సమన్లు పంపాయి.దీనిపై లోక్‌సభ ఎలక్షన్స్‌కు ముందు తన మేనల్లుడు అభిషేక్‌ను ఈడీ ద్వారా ఇరికించేందుకే ఇలా భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మధ్య ఆరోపించారు.అయితే దీదీ వ్యాఖ్యలపై స్పందించిన చౌదరి.. మమతా బెనర్జీ కేవలం తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కేంద్ర ఏజెన్సీలు వేధించినప్పుడు కానీ పిలిపించినప్పుడు మాత్రమే మాట్లాడతానని చెప్పారు అంటూ కొత్త పాయింట్‌ను లాగారు. అంతేకాదు గతంలో టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్‌ను కూడా ఈడీ పిలిపించిందని, అయితే అప్పుడు మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
అంతే కాదు..ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మమతా బెనర్జీ సానుభూతి చూపంచలేదన్న విషయాన్ని చౌదరి గుర్తు చేశారు. ఖోకా బాబు విషయంలోనే అంటే మమతా మేనల్లుడు అభిషేక్ విషయానికి ఈడీ, సీబీఐలు వస్తేనే బెంగాల్ ముఖ్యమంత్రి తన బాధను వ్యక్తం చేస్తారంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు.
కోట్లాది రూపాయల అనుమానాస్పద ట్రాన్జాక్షన్స్ నిర్వహించినట్లు లీప్స్ అండ్ బౌండ్స్ సీఈవోపై ఆమధ్య ఈడీ ఆరోపించింది. ఈ కేసులో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుజయ్ కృష్ణ భద్రను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ.. అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి తాజాగా టీఎంసీ ఎంపీకి కేంద్ర దర్యాప్తు సంస్థ సెప్టెంబర్ 12న సమన్లు జారీ చేసింది. ఇప్పుడు దీనిపైనే చౌదరి హాట్ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పొత్తులో ఉంటున్నామంటున్న ఈ రెండు పార్టీలు అవకాశం వచ్చినప్పుడు దెప్పి పొడుచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా అవినీతి ఆరోపణలతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాని ఎద్దేవా చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE