ఐపీఎల్ 2020: నేడే రాయల్ ఛాలెంజెర్స్, సన్ రైజర్స్ మధ్య కీలక ఎలిమినేటర్ మ్యాచ్

Indian Premier League, IPL 2020, IPL 2020 Highlights, IPL 2020 Latest Updates, IPL 2020 Live Cricket Score, IPL 2020 LIVE SCORE, IPL 2020 LIVE SCORE And Updates, IPL 2020 Live Updates, IPL 2020 Match 15 Live Score, IPL 2020 Match Dates

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 లో ప్లే ఆప్స్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్లే ఆప్స్ లో భాగంగా గురువారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో ముంబయి 57 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ఇక అబుదాబిలో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు జరిగే కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్లేందుకు క్వాలిఫయర్‌-2 లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడాల్సివుంటుంది. ఇక ఓడిపోయిన జట్టు ఐపీఎల్-2020 నుండి నిష్క్రమించనుంది.

సన్ రైజర్స్ జట్టు లీగ్ దశ చివరి మ్యాచుల్లో వరుసగా మూడు గెలిచి ప్లేఆప్స్ కు చేరుకుంది. మరోవైపు రాయల్ ఛాలెంజెర్స్ జట్టు చివరి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కానీ గతంలో కంటే ఈ సీజన్లో బెంగళూరు మెరుగైన ప్రదర్శన చేస్తుండడం, ఇక కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టు నుంచి వైదొలిగిన కూడా హైదరాబాద్ జట్టు సంచలనాలు నమోదు చేస్తుండడంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకుంది. ఫైనల్ వెళ్లే పోరులో ఏ జట్టు నిలుస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), జాషువా ఫిలిప్, దేవదత్ పడిక్కల్, ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, శివం దూబే, క్రిస్ మోరిస్/ఇసురు ఉదనా, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని/షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియామ్ గార్గ్/అభిషేక్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =