కాంగ్రెస్ అధిష్టానానికి షాక్.. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కార్యాలయానికి సీల్‌ వేసిన ఈడీ

Delhi Enforcement Directorate Seals National Herald Office Today Amid Probe Over Money Laundering Case, Enforcement Directorate Seals National Herald Office Today, Probe Over Money Laundering Case, National Herald Money Laundering Case, Money Laundering Case, ED Seals National Herald Office Today, National Herald Office, Enforcement Directorate, ED seals part of National Herald office, ED seals part of National Herald office amid money laundering probe, National Herald Money Laundering Case News, National Herald Money Laundering Case Latest News, National Herald Money Laundering Case Latest Updates, National Herald Money Laundering Case Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్‌పై కొనసాగుతున్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సీల్ వేసింది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది. కాగా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుపబడుతోన్న వార్తాపత్రిక. ఇప్పటికే ఈ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మంగళవారం న్యూఢిల్లీ లోని హెరాల్డ్‌ హౌజ్‌లో సోదాలు కూడా చేసింది. దీనితో పాటుగా మరో 11 ప్రాంతాల్లో కూడా ఇక కాలంలో దాడులు నిర్వహించింది. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. మరోవైపు ఈ చర్యల నేపథ్యంలో.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం వెలుపల అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇక ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ “మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి, డబ్బు ప్రమేయం లేకపోతే లాండరింగ్ ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. మరోవైపు ఈడీ చర్యల సందర్భంగా కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, పి.చిదంబరం తదితరులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + seven =