పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానానికి నిర్ణయం

Punjab CM Bhagwant Mann To Bring Resolution Against Agnipath Scheme in Assembly, Punjab CM To Bring Resolution Against Agnipath Scheme in Assembly, CM Bhagwant Mann To Bring Resolution Against Agnipath Scheme in Assembly, Bhagwant Mann To Bring Resolution Against Agnipath Scheme in Assembly, Resolution Against Agnipath Scheme in Assembly, Resolution Against Agnipath Scheme, Assembly, Punjab CM Bhagwant Mann, Bhagwant Mann, Punjab CM, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protest, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దీనిపై స్పందించారు. దీనిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, కేంద్రం దీనిపై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. అలాగే అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం తీసుకువస్తుందని ఆయన తెలిపారు. ‘అగ్నిపథ్ అనేది ఎన్‌డిఎ ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్య. ఇది భారత సైన్యం యొక్క ప్రాథమిక ఆకృతిని నాశనం చేస్తుంది. దీనిపై యువకులెవరూ సంతోషంగా లేరు. దీనిని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు రైళ్లకు నిప్పంటించడం వంటివి చేయడం చూశాం’ అని సిఎం మాన్ అన్నారు.

ఈ పథకానికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష నాయకుడు పర్తప్ సింగ్ బజ్వా చేసిన సూచనను ఆయన ఆమోదించారు. విధానసభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్‌లో జీరో అవర్ సమయంలో కాంగ్రెస్ నాయకుడు బజ్వా.. అగ్నిపథ్ అంశాన్ని లేవనెత్తారు, ఈ పథకం పంజాబ్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి తీర్మానం తీసుకురావాలని సీఎంను డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం మాన్.. ఈ విషయాన్ని సున్నిత భావోద్వేగ సమస్యగా అభివర్ణించారు. తప్పకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడతామని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =