ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..అది ఇండియాలోనే ఉందని తెలుసా?

Do You Know There is Only One Railway Station in That State It is in India,One Railway Station in That State,One Railway Station State in India,Do You Know There is Only One Railway Station,Mango News,Mango News Telugu,Bairabi Railway Station, Fourth largest railway system,only one railway station in that state, Railway Station,This Indian State Has Only 1 Railway Station,Indian Railway,Only 1 railway station,Only 1 railway station in the entire state,Indian Railway Stations,One Railway Station in That State Latest News,One Railway Station in That State News Today,Bairabi Railway Station Latest News,Bairabi Railway Station Latest Updates

ఇండియన్ రైల్వే వ్వవస్థ అనగానే కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే అది పెద్ద వ్యవస్థగానే అందరికీ తెలుసు. నిజంగా ఇది భారత్‌కు లభించిన అమూల్యమైన వారసత్వం. ఎంతోమంది సామాన్యులకు తమ ఆప్తులను కలిపే పెన్నిధి. జీవిత ప్రయాణాలను తనతో ముడి వేసుకుని మరీ ఎంతోమందిని వారివారి ఊళ్లకు చేర్చే అపూర్వమైన.. అతిపెద్ద వాహనం. అందుకేనేమో ఏ రైల్వేస్టేషన్ చూసినా జనాలతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఎన్ని కొత్త రైళ్లు వస్తున్నా.. వాటి ఆదరణ ఏమాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉంది. నిజానికి భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ (Fourth largest railway system)గా తన సేవలను అందిస్తోంది. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇండియన్ రైల్వే (Indian Railways)ల నెట్ వర్క్ దేశంలోని ప్రతి మూలలోనూ విస్తరించే ఉంది.

ప్రతి దేశంలోనూ ఎన్నో రైల్వే స్టేషన్లతో తన సేవలందిస్తూ కొన్ని విచిత్రాలను కూడా తన హిస్టరీలో నమోదు చేసుకుంది భారతీయ రైల్వే. అలాగే ఒక రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్గా కొన్నేళ్లుగా సేవలందిస్తోంది ఓ రైల్వే స్టేషన్. 8వేలకు పైగా రైల్వే స్టేషన్ ఉన్న భారత దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉండటమా.. అది కూడా ఆ రాష్ట్రానికి మొత్తానికి ఒకటా అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. అవును మిజోరాం రాష్ట్రం (Mizoram State)లో ఒకే రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పేరు బైరాబీ రైల్వే స్టేషన్ (Bairabi Railway Station). మిజోరాం జనాభా 11 లక్షలు ఉండగా వారందరికీ ఒకే రైల్వే స్టేషన్ ఉండటం ఇప్పటికీ ఆశ్చర్యమే.

బైరాబీ రైల్వే స్టేషన్ (Bairabi Railway Station) మిజోరాంలోని కొలాసిబ్ జిల్లాలో ఉంది. అయితే ఈ ఒక్క జిల్లాలోని వారే కాదు.. మిజోరాంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రజలు బైరాబీ రైల్వే స్టేషన్ కు వచ్చే వేరేవేరే రాష్ట్రాలకు వెళుతుంటారు. ఇక్కడ ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకులను కూడా ఇక్కడ నుంచే రవాణా చేస్తారు. ప్రారంభంలో ఈ స్టేషన్ చాలా చిన్నగా ఉండేది. అయితే 2016లో దీనిని విస్తరించారు. దీంతో నాలుగు ఫ్లాట్ ఫారమ్‌లతో కాస్త విశాలంగానే కనిపిస్తుంది. ట్రైన్ లింక్స్ కోసం నాలుగు ట్రాక్‌లు కూడా ఉన్నాయి. అయితే దీనిని ఎంత పెద్దగా చేసినా.. పెరుగుతున్న జనాభాకు ఇది సరిపోవడం లేదని.. మరో స్టేషన్ ను నిర్మించాలని మిజోరాం వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మిజోరాంలో మరో స్టేషన్‌ను నిర్మించాలని రైల్వే శాఖ ప్రతిపాదన చేసింది. అంతేకాదు దీంతో పాటు బైరాబీ స్టేషన్ నుంచి రైల్వే కనెక్టివిటీని మరింత డెవలప్ చేసే ఆలోచన కూడా ఉందన్న వార్తలు అయితే చాలా రోజుల నుంచీ వినిపిస్తున్నాయి. అయితే ఒకే ఒక స్టేషన్ ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలుస్తూ.. అదే క్రెడిట్‌ను కంటెన్యూ చేస్తుందో లేక మిజోరాం వాసుల అవసరాలను, వారి కలను నెరవేర్చడానికి ముందుకెళ్తుందో వేచి చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =