త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా

Dr Manik Saha Elected as New Chief Minister of Tripura State, New Chief Minister of Tripura State, Manik Saha Elected as New Chief Minister of Tripura, Manik Saha New CM of Tripura, New Chief Minister of Tripura, Tripura Chief Minister, Chief Minister Manik Saha, Tripura Chief Minister Manik Saha, Manik Saha takes oath as 11th chief minister of Tripura, 11th chief minister of Tripura, Manik Saha was chosen as Tripura's chief minister, CM of Tripura, Tripura CM Manik Saha, Tripura New CM News, Tripura New CM Latest News, Tripura New CM Latest Updates, Tripura New CM Live Updates, Mango News, Mango News Telugu,

త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా పేరు ఖరారైంది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి మరియు బీజేపీ కేంద్ర పరిశీలకుడు భూపేందర్ యాదవ్, ఇతర బీజేపీ నేతలు ఆధ్వర్యంలో జరిగిన త్రిపుర బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మాణిక్ సాహాకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహాను ఎన్నుకున్నట్టు భూపేందర్ యాదవ్ తాజాగా ట్వీట్ చేశారు. మాణిక్ సాహా ప్రస్తుతం త్రిపుర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగానే కాకుండా, రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థికి నాయకత్వ అప్పగించే క్రమంలోనే మాణిక్ సాహా వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తుంది.

ముందుగా శనివారం మధ్యాహ్నం అధిష్టానం ఆదేశాల మేరకు బిప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ మాణిక్ సాహా కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం బిప్లవ్ కుమార్ దేవ్ ట్విట్టర్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనందుకు మాణిక్ సాహా జీకి అభినందనలు మరియు శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ మరియు నాయకత్వంలో త్రిపుర అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను” అని బిప్లవ్ కుమార్ దేవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − twelve =