మహారాష్ట్ర, హర్యానాలలో అక్టోబర్ 21న ఎన్నికలు

Assembly Elections Schedule, Dates For Haryana And Maharashtra States Assembly Polls, EC Announces Dates For Haryana And Maharashtra States Assembly Polls, Haryana And Maharashtra States Assembly Polls, Haryana Assembly Elections Schedule, latest political breaking news, Maharashtra And Haryana Assembly Elections, Maharashtra And Haryana Assembly Elections Schedule, national news headlines today, national news updates 2019, National Political News 2019

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అక్టోబర్ 21న ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో నామినేషన్ల పక్రియ ఈ నెల 27న మొదలయ్యి, అక్టోబర్ 4 నాటికీ ముగుస్తుందన్నారు. అక్టోబర్ 21న తేదీన పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో నేటినుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని సునీల్ అరోరా ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రస్తుతం రెండు చోట్లకూడ బీజేపీ పార్టీనే అధికారంలో ఉండడంతో ఈ ఎన్నికలు పార్టీకి ఏంతో కీలకంగా మారనున్నాయి.

మరో వైపు ఈ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 64 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ లో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి కూడ అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ లో 1 , కేరళ రాష్ట్రంలో 5, మధ్యప్రదేశ్‌ లో 1, మేఘాలయ లో 1, ఒడిశాలో 1, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1, బిహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 1, అసోంలో 4, గుజరాత్‌లో 4, హిమాచల్‌ ప్రదేశ్‌ లో 2, కర్ణాటక రాష్ట్రంలో 15, పుదుచ్చేరిలో 1, పంజాబ్‌లో 4, రాజస్తాన్‌ లో 2, సిక్కింలో 3, తమిళనాడులో 2, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 11చోట్లా ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 4 =