మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

ECI Announces Bye-election Schedule for Khatauli Assembly Constituency of Uttar Pradesh, Assembly Bye-elections Results, BJP Wins Four of Seven Assembly Seats, BJP Loses in Munugode, BJP Loses in Mokama, Mango News,Mango News Telugu, ECI Released Bye-election Schedule for 5 Assembly, 1 Parliamentary Constituency in UP, Odisha Bye-election , Rajasthan Bye-election, Bihar Bye-election, Chhattisgarh Bye-election, UP, Odisha, Rajasthan, Bihar, Chhattisgarh, EC Released Notification, EC By-Election Notification, Election Comission Of India, Election Comission Latest News And Updates

దేశంలో ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్/యూపీలో ఖాళీగా ఉన్న మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఈ మేరకు యూపీలోని ఖతౌలీ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌సింగ్ సైనీపై అనర్హత వేటు వేయడంతో ఖతౌలీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఖతౌలీలో డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుందని ఈసీ తెలిపింది. కాగా ఈ ఖతౌలీ ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియను హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఇతర ఉపఎన్నికల కౌంటింగ్ తో పాటుగా డిసెంబర్ 8న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.

ఖతౌలీ ఉపఎన్నిక షెడ్యూల్ వివరాలు:

  • గెజిట్ నోటిఫికేషన్‌ జారీ తేదీ: నవంబర్ 10
  • నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: నవంబర్ 17
  • నామినేషన్ల పరిశీలన: నవంబర్ 18
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 21
  • పోలింగ్ తేదీ: డిసెంబర్ 5
  • ఓట్ల లెక్కింపు పక్రియ: డిసెంబర్ 8.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =