దేశవ్యాప్తంగా రిజ‌ర్వేష‌న్ల‌లో 50% ప‌రిమితి ఎత్తేయాలి – బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్

Bihar CM Nitish Kumar Demands Remove 50 Per Cent Cap On Reservations in The Country,Bihar CM Nitish Kumar,50 Per Cent Cap On Reservations,Nitish Kumar Remove 50 Per Cent,Mango News,Mango News Telugu,Remove 50 Per Cent Cap On Quotas,Nitish Kumar Latest News And Updates,Day After Ews Verdict,Day After Sc's Ews Verdict, Nitish Kumar,CM Nitish Kumar,Nitish Kumar Wants 50% Quota Cap Scrapped,Remove 50% Cap On Quotas Says Nitish Kumar

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడ‌బ్ల్యూఎస్‌) 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఆయన మంగళవారం దీనిపై తన అభిప్రాయాలను జర్నలిస్టులతో పంచుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కుల గణన జ‌రుపాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం నితీశ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పులో న్యాయముందని, పేదలకు రిజర్వేషన్ల విషయంలో తాము ఎప్పుడూ మద్దతుగా ఉన్నామని తెలిపారు. అయితే రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని, ఎందుకంటే ఓబీసీలు మరియు ఈబీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలను కోల్పోతున్నారని వెల్లడించారు. వివిధ సామాజిక వర్గాల జనాభాపై తాజా అంచనా అవసరాన్ని పునరుద్ఘాటించిన నితీశ్, గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి దీనిపై నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eight =