15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2

ECI Announces Election Schedule for 57 Rajya Sabha Seats Polling to be held on June 10, ECI Announces Election Schedule for 57 Rajya Sabha Seats, Polling to be held on June 10, Election Commission of India, Election Commission of India Announces Election Schedule for 57 Rajya Sabha Seats Polling to be held on June 10, Polling for 57 Rajya Sabha Seats to be held on June 10, 57 Rajya Sabha Seats, Rajya Sabha Seats, Rajya Sabha Seats Polling, Elections for 57 Rajya Sabha seats to be held on June 10, Rajya Sabha Polls For 57 Seats to be held on June 10, 57 Rajya Sabha Seats election schedule released, Election Commission announced poll schedule for Biennial Elections for 57 Rajya Sabha seats from 15 states, Rajya Sabha Seats Elections, Rajya Sabha Seats Elections Latest News, Rajya Sabha Seats Elections Latest Updates, Rajya Sabha Seats Elections News, Mango News, Mango News Telugu,

త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు (మే 12, గురువారం) ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2022 జూన్ నుంచి ఆగస్టు వరకు 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీకాలం పూర్తికానుండడంతో ఆ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభు సురేష్ ప్రభాకర్, టీజీ వెంకటేష్, యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వి.విజయసాయి రెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఇక మిగిలిన కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్, ఛత్తీస్‌ గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి 13 రాష్ట్రాల్లో అన్ని కలిపి మొత్తం 51 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:

  • రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌: మే 24, 2022
  • నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: మే 31
  • రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: జూన్ 1
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూన్ 3
  • రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహణ: జూన్ 10 (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌)
  • ఓట్ల లెక్కింపు పక్రియ: జూన్ 10 (సాయంత్రం 5 గంటల నుంచి)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =