రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

2020 Indian Rajya Sabha elections, 55 Rajya Sabha Seats, ECI, Election Commission of India, election of rajya sabha, Elections For 55 Rajya Sabha Seats, Mango News Telugu, rajya sabha, rajya sabha election 2020, Rajya Sabha Elections, Rajya Sabha Elections 2020,rajya sabha election schedule
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్‌లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల పదవీకాలం పూర్తవడంతో ఆ స్థానాలకు మార్చ్ 6వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి టి.సుబ్బిరామిరెడ్డి, మహమ్మద్ అలీ ఖాన్, తోట సీతారామలక్ష్మి, కె.కేశవ రావు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కే.వి.పి రామచంద్ర రావు, గరికపాటి మోహనరావుల యొక్క పదవీకాలం ఏప్రిల్ 9, 2020తో పూర్తవనుంది. ఇక మిగిలిన 15 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌ గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, రాజస్థాన్, మేఘాలయ ఉన్నాయి.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:

  • రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌: మార్చ్ 6
  • నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: మార్చ్ 13
  • రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: మార్చ్ 16
  • నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: మార్చ్ 18
  • రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహణ: మార్చ్ 26 (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌)
  • ఓట్ల లెక్కింపు పక్రియ: మార్చ్ 26

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =