మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, ఈసీ నిర్ణయం

Assembly Elections, Assembly Elections 2021, BJP chief Nadda responds on EC’s decision, BJP welcomes EC order banning victory processions, EC bans all victory processions, EC bans all victory processions after May 2 election results, EC bans victory processions, ECI Issued Orders over Prohibition of Victory Procession, ECI Issued Orders over Prohibition of Victory Procession After Election Results, ECI Issued Orders over Prohibition of Victory Procession After Election Results on May 2nd, Election Commission bans victory procession, Election Commission bans victory processions, Election Commission on Election results, Mango News, Prohibition of Victory Procession After Election Results, Victory Procession Banned By EC

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ మే 2న జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు కూడా మే 2 న వెలువడనున్నాయి. దీంతో మే 2న ఫలితాల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తునట్టుగా ప్రకటించింది.

అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సమయంలో వారి వెంట కేవలం ఇద్దరు మాత్రమే ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాలని ఆదేశించింది. మరోవైపు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పూర్తవగా, ఏప్రిల్ 29న జరిగే ఎనిమిదో దశ పోలింగ్ తో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 7 =