ఫిఫా ప్రపంచ కప్ 2022: ఘనాపై 3-2తో విజయం సాధించిన పోర్చుగల్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డ్ గోల్‌

FIFA World Cup 2022 Portugal Wins on Ghana with 3-2 Star Player Cristiano Ronaldo Sets Record Goal,FIFA World Cup 2022, Cristiano Ronaldo scores record goal,Portugal beats Ghana 3-2,Mango News,Mango News Telugu,Fifa World Cup, Argentina Lost In Match,Saudi Arabia Declares Public Holiday,Saudi Arabia Won Match,Saudi Arabia FIFA World Cup,Argentina FIFA World Cup,Fifa World Cup 2022,Fifa World Cup Latest News And Updates,Fifa World Cup News And Live Updates

ఫిఫా వరల్డ్‌ కప్‌లో పోర్చుగల్‌ బోణీ చేసింది. గ్రూప్‌-హెచ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఘనాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 3-2తో గెలిచింది. పోర్చుగల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, ఫెలిక్స్‌, రాఫెల్‌ లియోలు ఒక్కో గోల్ చేశారు. ఇక ఘనా తరఫున ఆండ్రెస్‌ అయూ, బుకారి గోల్స్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డ్ గోల్ చేయడం విశేషం. ఐదు ఫిఫా ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన మొదటి ఆటగాడిగా రొనాల్డో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే సెకండాఫ్‌లో ఇరు జట్లూ పోటాపోటీగా గోల్స్ చేయడానికి ప్రయత్నించాయి.

ఈ క్రమంలో 63వ నిమిషంలో పెనాల్టీ రూపంలో పోర్చుగల్‌కు అదృష్టం కలసి వచ్చింది. దీన్ని క్రిస్టియానో రొనాల్డో గోల్‌గా మలచి పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే 74వ నిమిషంలో ఘనా ఆటగాడు ఆండ్రెస్‌ అయూ గోల్ చేయడంతో స్కోరు సమం అయింది. అనంతరం రొనాల్డో సేన రెండు నిమిషాల తేడాతో రెండు గోల్స్‌ చేయడంతో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 78వ నిమిషంలో ఫెలిక్స్‌, 80వ నిమిషంలో రాఫెల్‌ లియోలు గోల్స్ చేశారు. ఆ తరువాత 89వ నిమిషంలో ఘనా ఆటగాడు ఒస్మాన్‌ బుకారి హెడర్‌తో గోల్‌ చేయడంతో జట్టు ఖాతాలో 2 గోల్స్ చేరాయి. ఇక మ్యాచ్ చివరి వరకూ ఘనా మరో గోల్ చేయలేకపోవడంతో 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది. ఇక ఈ క్రమంలో తాను ఆడిన ఐదు వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు పీలే, క్లోజ్‌, సీలర్‌, మెస్సీలు 4 వరల్డ్‌కప్‌లలో గోల్స్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =