తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ. 9,500 కోట్లతో ‘అమ‌ర‌రాజా గ్రూప్’ లిథియం అయాన్ గిగా ఫ్యాక్ట‌రీ ఏర్పాటు

Minister KTR Announces Amara Raja Group To Setup Lithium Ion Cell Manufacturing Unit with Rs 9500 Cr Investment in Telangana,Huge Investment For Telangana,Rs. 9500 Crore Telangana Investment,Amara Raja Group, Amara Raja Group Lithium Ion Giga Factory,Amara Raja Group Factory,Amara Raja Group Latest News And Updates,Mango News,Mango News Telugu,Amara Raja Group Batteries,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిప‌ల్లిలో విద్యుత్ వాహ‌నాలకు వినియోగించే బ్యాట‌రీల త‌యారీ యూనిట్‌ను నెల‌కొల్ప‌డానికి ప్రముఖ సంస్థ ‘అమ‌ర‌రాజా గ్రూప్’ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమర రాజా తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం మంత్రి సమక్షంలో అమర రాజా గ్రూప్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు మరో చారిత్రాత్మక విజయం లభించిందని పేర్కొన్నారు. అమర రాజా ఇప్పటి వరకు రూ.9,500 కోట్ల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని, దీనిద్వారా ఈవీ మరియు అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ తయారీకి అనువైన గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రకటించారు. వారికి అన్ని విధాలా ప్రభుత్వ పరంగా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో అమ‌ర‌రాజా గ్రూప్ డైరెక్ట‌ర్, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పాల్గొన్నారు. ఒప్పంద కార్యక్రమం అనంతరం జయదేవ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి, అలాగే భారీ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఇక వ‌చ్చే 10 ఏళ్లలో తెలంగాణ‌లో రూ. 9,500 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నామ‌ని, ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా దాదాపు 4,500 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here