ఉచిత కోవిడ్ టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు : సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌

Covid helpline in Hyderabad, COVID tele medicine consultation, COVID Telemedicine Consultation, Cyberabad Commissionerate, Cyberabad Police, Free COVID Telemedicine Consultation, Free COVID Telemedicine Consultation Call Centre Set up, Free COVID Telemedicine Consultation Call Centre Set up at Cyberabad Commissionerate, Mango News, Sajjanar starts COVID telemedicine consultation, Sajjanar starts COVID telemedicine consultation call centre, telangana government, Telangana government launches telemedicine call center, telemedicine call center

నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ లో ఉచిత కోవిడ్ టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం నాడు ప్రారంభించారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లతో కలిసి టెలిమెడిసిన్ కన్సల్టేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వీసీ సజ్జనార్‌ తెలిపారు. కాల్ సెంటర్ నెంబర్ +91 8045811138 కు ఫోన్ చేసి కోవిడ్ పై డాక్టర్ల సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జాయింట్ సెక్రటరీ డా.రాజీవ్‌ మీనన్‌ నేతృత్వంలో ఈ కాల్ సెంటర్ నడుస్తుందని చెప్పారు.

ప్రజల కోసం దాదాపు 20 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వచ్చే సందేశాలు లేదా కోవిడ్ వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యవేక్షణ, చికిత్స గురించి సంప్రదించడానికి ఈ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనాపై ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అపోహలు నమ్మవద్దని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్ సిలిండర్లు, తీవ్ర అస్వస్థత, నాన్ కోవిడ్ ప్రశ్నలకు సంబంధించి అయితే ఈ నంబరుకు ఫోన్‌ చేయొద్దని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 10 =