ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 7796 పాజిటివ్ కేసులు నమోదు

Anandayya Writes a Letter to CM Jagan Seeking Support in Medicine Manufacture, Distribution

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 7796 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,71,007 కు చేరింది. కొత్తగా తూర్పుగోదావరి (1302), చిత్తూరు (1210) జిల్లాల్లో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 14,641 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 77 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11629 కి పెరిగింది. గత 24 గంటల్లో 89,732 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,99,46,253 కు చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూన్ 8, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 17,71,007
  • కొత్తగా నమోదైన కేసులు : 7,796
  • కొత్తగా నమోదైన మరణాలు : 77
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 16,51,790
  • యాక్టీవ్ కేసులు : 1,07,588
  • మొత్తం మరణాల సంఖ్య : 11629
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here