గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: నేడు నాలుగు జిల్లాల్లో ప్రచార ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

Gujarat Assembly Elections 2022: PM Modi Participates Today Election Rallies in Mehsana Dahod Vadodara Bhavnagar,Gujarat Assembly Elections-2022, Total 1621 Candidates In The Fray, Extensive Campaigning,Gujarat Assembly Elections,Gujarat Assembly Elections,Pm Modi Election Campaign In Gujarat, Congress Insults Tribals, Mocked Me For Wearing Tribal Attire,Narendra Modi,Gujarat , Gujarat Assembly Elections,Assembly Elections In Gujarat, Gujarat Assembly Poll,Pm Narendra Modi, Modi Latest News And Updates,Gujarat Assembly News And Live Updates,Mango News,Mango News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తోలి దశలో డిసెంబర్ 1వ తేదీన 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు కీలక నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిక ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మెహసానా, దాహోద్, వడదోర, భావ్ నగర్ వంటి జిల్లాల్లో బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మెహసానాలో 12.00 గంటలకు, దాహోద్ లో 2.30 గంటలకు బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని పాల్గొనగా, వడదోర లో సాయంత్రం 4.30 గంటలు, భావ్ నగర్ లో 6.30 గంటలకు జరగనున్న బీజేపీ సభల్లో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

మెహసానా సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అనేది వ్యక్తి కంటే పార్టీ గొప్పదని, పార్టీ కంటే దేశం గొప్పదని భావిస్తుందన్నారు. ఇది మన సంస్కృతి అని, ఈ సంస్కృతితో తాము పని చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోడల్ అంటే అవినీతి, బంధుప్రీతి, వంశ రాజకీయాలు, మతతత్వం మరియు కులతత్వం అని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి అధికారంలో ఉండేందుకు ప్రజల మధ్య చిచ్చు పెట్టడంలో వారికి పేరుందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పాటించిన ఆ విధానం కేవలం గుజరాత్‌ ను మాత్రమే కాకుండా భారతదేశాన్ని కూడా నాశనం చేసిందని, ఈ రోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరింత కష్టపడి పనిచేయవలసి ఉందని అన్నారు. గత 20 ఏళ్లలో గుజరాత్ చాలా మారిపోయిందన్నారు. నేటి తరానికి గుజరాత్‌ ఎదుర్కున్న కొరత/కరువు తెలియదని, ఈ తరం కొరత చూడలేదని, దీనికోసం ముందు తరం చాలా కష్టపడిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here