‘తాజ్ మహల్’ స్థలంపై వివాదం.. అది మాదే అంటున్న జైపూర్ రాజ కుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ

Taj Mahal Land Originally Belongs To Our's Jaipur Royal Family Claims BJP MP Diya Kumari, BJP MP Diya Kumari Claims Taj Mahal Land, Taj Mahal Land Originally Belongs To Our's Jaipur Royal Family, BJP MP Diya Kumari Says Taj Mahal Land Originally Belongs To Our's Jaipur Royal Family, Jaipur Royal Family, Taj Mahal Land, Taj Mahal land belonged to Jaipur Royal Family claims BJP MP Diya Kumari, Taj Mahal land originally belonged to Our's Jaipur royal family, BJP MP Diya Kumari claims the lands on which Taj Mahal was built belonged to her family, BJP MP Diya Kumari, MP Diya Kumari, Diya Kumari, BJP MP, Taj Mahal Land News, Taj Mahal Land Latest News, Taj Mahal Land Latest Updates, Taj Mahal Land Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రేమికుల స్వప్నసౌధం ‘తాజ్ మహల్’ స్థలంపై వివాదం నెలకొంది. క్రీ.శ 1650 ప్రాంతంలో యమునా నది ఒడ్డున నిర్మించబడినన తాజ్ మహల్ స్థలం మాది అంటూ తాజాగా ఒక ఎంపీ ఆరోపించడం సంచలనమైంది. తాజ్‌మహల్‌ను నిర్మించిన భూమి మొదట జైపూర్ రాజకుటుంబానికి చెందినదని, దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని, రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యురాలు దియా కుమారి బుధవారం పేర్కొన్నారు. ఆ భూమి జైపూర్ రాజ కుటుంబానికి చెందిన మా పూర్వీకులదని, అప్పటి మొఘల్ రాజు షాజహాన్ స్వాధీనం చేసుకున్నట్లు మా వద్ద పత్రాలు ఉన్నాయి అని జైపూర్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి అన్నారు.

కాగా తాజ్ మహల్ లోపల 20 గదులు హిందూ విగ్రహాలకు సంబంధించిన ఆనవాలు ఉన్నాయని, ఆ రూములను ఉనికిని తనిఖీ చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ రజనీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో దియా కుమారి ప్రకటన చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. తాజ్ మహల్ చరిత్రపై నిజనిర్ధారణ విచారణ కోరుతూ రజనీష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఆమె సమర్థించారు. మరోవైపు దీనిపై రజనీష్ సింగ్ స్పందిస్తూ.. తాజ్ మహల్‌లోని దాదాపు 20 గదులు లాక్ చేయబడ్డాయి. అక్కడ ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఈ గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు, గ్రంధాలు ఉన్నాయని భావిస్తున్నాం. అందుకే వాటిని ఓపెన్ చేయాలనీ కోరుతున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =