సైన్ బోర్డులు కనిపించక.. మూడుసార్లు చలాన్ కట్టాను: అనురాగ్ జైన్

I Did Not See Signboards I Pay Challans Three Times Says Anurag Jain, I Did Not See Signboards, I Pay Challans Three Times, Three Times Challans Anurag Jain, Anurag Jain, Delhi, Speed Limit, Latest Anurag Jain Challans News, Anurag Jain Challans, Delhi Traffic Challans, Transport, Delhi Traffic Rules, Mango News, Mango News Telugu
Anurag Jain, Delhi, Speed limit,

ఢిల్లీలో వాహనదారులకు కొత్త సమస్యొచ్చి పడింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కుప్పలు తెప్పలుగా చలాన్లు వచ్చి పడుతున్నాయి. రోడ్డు పక్కన స్పీడ్ లిమిట్ బోర్డులు, సైన్ బోర్డులకు చెట్లు, స్తంభాలు అడ్డుగా ఉండడంతో.. వాహనదారులు వాటిని గమనించలేకపోతున్నారు. దీంతో స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి వెళ్లడం వల్ల.. అంతే స్పీడ్‌గా చలాన్లు వచ్చి పడుతున్నాయి. కుప్పలు.. కుప్పలుగా వస్తోన్న చలాన్లను చూసి ఢిల్లీ వాహనదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇదే సమస్యను రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి కూడా ఎదుర్కోవడం సంచలనంగా మారింది.

ఇటీవల రవాణాశాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మూడు చలాన్లను అందుకున్నారు. స్పీడ్ లిమిట్ క్రాస్ చేసినందుకుగానూ అతని వాహనానికి మూడు చలాన్లు పడ్డాయి. చెట్ల వెనుక ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను గమనించకుండా వెళ్లడం వల్ల అనురాగ్ జైన్ మూడు చలాన్లను అందుకున్నారు. తాను వెళ్తున్న సమయంలో స్పీడ్ లిమిట్ 60 KMPH అని తాను అనుకున్నానని.. అయినప్పటికీ తాను 61 KMPH వేగంతోనే వెళ్లానని అనురాగ్ జైన్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు స్పీడ్ లిమిట్ క్రాస్ చేసినందుకుగానూ తాను మూడు చలాన్లు అందుకున్నానని తెలిపారు.

టెక్నాలజీ వారి స్థానంతో సంబంధం లేకుండా అందరినీ ఒకేలా చూస్తుందని అనురాగ్ జైన్ అన్నారు. ‘యజమాని ఎవరో టెక్నాలజీ గుర్తించలేదు. నేను వేగంగా వాహనం నడిపినందుకు మూడు చలాన్లు చెల్లించాను. స్పీడ్ లిమిట్ బోర్డులు నాకు కనిపించలేదు. స్పీడ్ లిమిట్ బోర్డులు వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని పోలీసులకు చెప్పాను. స్పీడ్ లిమిట్ బోర్డులు స్పష్టంగా కనిపించడం వల్ల.. వాహనదారులు ఓవర్ స్పీడ్‌గా వెళ్లేందుకు ఆస్కారం ఉండదు’’ అని అనురాగ్ జైన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 20 =