ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..

CM Revanth Reddy Give Shock to CM Jagan, Shock to CM Jagan, Revanth Reddy Give Shock Jagan, Revanth Reddy, Jaganmohan Reddy, AP, Telangana, Latest Revanth Reddy Shock News, Latest Revanth Reddy Delhi News, 408 Crores, CM Jagan, CM Revanth Reddy, TS and AP Political News, Polictical News, Mango News, Mango News Telugu
Revanth reddy, Jaganmohan reddy, AP, Telangana

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహార శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీతో సమావేశమైన రేవంత్ రెడ్డి.. మెట్రో రైల్ ఫేజ్-2 ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కోరారు. అలాగే ఉద్యానవనాలు, వ్యాపార కేంద్రాలు,  షాపింగ్ కాంప్లెక్స్‌లతో హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ఆయను హర్‌దీప్ సింగ్‌కు వివరించారు.

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌కు వివరించారు. ఈ మేరక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ ఇళ్లను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి.. కొత్త ఇళ్లు మంజూర్ చేయాలని కోరారు. అలాగే పాలమూరు-ఆర్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పించాలని కోరారు.

ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ఏపీ సీఎం జగన్‌కు ఝలక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన రూ. 408 కోట్లను వసూల్ చేసి ఇప్పించాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ ఆస్తులను వినియోగించిందని.. ఇందుకోసం తెలంగాణకు రూ. 408 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించారు. విభజన జరిగిన తర్వాత కూడా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, లోకాయుక్తి, హైకోర్టును ఏపీ సర్కార్ వినియోగించుకుందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ విభజన చట్టంలో ప్రస్తావించిన ఆస్తులని.. అందుకే ఏపీ సర్కార్ నుంచి రూ. 408 కోట్లు వసూల్ చేసి ఇవ్వాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =