బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు భారత్‌కు షాక్.. కెప్టెన్ రాహుల్‌కు గాయం, రేపు ఆడేది అనుమానమే?

Ind Vs Ban 2Nd Test Team India Eye On Clean Sweep Stand In Skipper Lokesh Rahul Injured Ahead Match,India Bangladesh second Test,Captain Rahul is injured,Kl Rahul As Captain, Pujara As Vice-Captain, Rohit As Vice-Captain, Shami As Vice-Captain, Jadeja As Vice-Captain,First Test Against Bangladesh,Mango News ,Mango News Telugu,India Vs Bangladesh,Ind Vs Bangladesh,Ind Vs Bng,India Vs Bangladesh Test Series,Indian Cricket Team,Bangladesh Cricket Team,India,Bangladesh,Bangladesh Vs India, India In Bangladesh,India Test Series,Bangladesh Test Series,Ind Vs Bng Test Series,

బంగ్లాదేశ్‌తో రెండో మరియు ఆఖరి టెస్టుకు ముందు భారత్‌కు షాక్ తగిలింది. కెప్టెన్ లోకేష్ రాహుల్‌కు గాయం అయింది. దీంతో రేపు ప్రారంభం కానున్న రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడో? లేదో? అని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆందోళనగా ఉంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో లోకేష్ రాహుల్‌కు బంతి బలంగా చేతికి తాకిందని, దీంతో ప్రాక్టీస్ నిలిపివేశాడని తెలిపారు. వెంటనే జట్టు వైద్యుడితో చికిత్స తీసుకున్నాడని, ప్రస్తుతం రాహుల్ పరిస్థితి బాగానే ఉందని వెల్లడించాడు. అయితే రేపు ఉదయానికి గాయం తీవ్రతను బట్టి ఆడేది, లేనిది నిర్ణయిస్తామని స్పష్టం చేశాడు. దీనిపై రాహుల్ అంతగా ఆలోచించడం లేదని, బహుశా రేపటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని విక్రమ్ రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా ఇప్పటికే ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరియు పేసర్ నవదీప్ సైనీ వంటి ఆటగాళ్లు గాయపడటం జట్టుని కలవర పరుస్తోంది. తొలి టెస్టును భారీ తేడాతో గెలుచుకుని మంచి ఊపు మీదున్న టీమిండియాకు ఇది ఒక రకంగా షాక్ లాంటిదే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో రాహుల్ ఆడలేకపోతే అతని స్థానంలో వైస్ కెప్టెన్, టాప్ ఆర్డర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే రాహుల్ స్థానంలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్.. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా పాయింట్లను మరింతగా మెరుగు పరుచుకుని తద్వారా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరుకోవాలని భావిస్తోంది. స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారా, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ తదితరులు రాణిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ గురువారం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవనుంది.

జట్లు అంచనా..

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్)/అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, ఛెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరి, ముష్ఫికర్ రహీమ్, జాకీర్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మొహమ్మద్ మెహిది హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, రెహమాన్ రాజా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =