తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన కోహ్లీ, పలు రికార్డులు బద్దలు.. శ్రీలంక ముందు 374 పరుగుల భారీ లక్ష్యం

IND vs SL 1st ODI Virat Kohli Hits 73rd international Century Equals Tendulkar's Record of Most ODI Tons at Home,Virat Kohli on verge,Virat Kohli On Cusp,India vs Sri Lanka,Breaking Sachin Tendulkar Record,IND vs SL 1st ODI,Sri Lanka vs India,Full Scorecard of Sri Lanka,Indian Vs Sri Lanka,Mango News,Mango News Telugu,India Vs Sri Lanka Today,India Vs Sri Lanka T20 2023,India Vs Sri Lanka T20,India Vs Sri Lanka Odi Latest News And Updates,India Vs Sri Lanka Odi,India Vs Sri Lanka Live Streaming Dd National,India Vs Sri Lanka Live Streaming,India Vs Sri Lanka Live Score,India Vs Sri Lanka Live,India Vs Sri Lanka Highlights,India Vs Sri Lanka 2023,India Vs Sri Lanka 2023,India Vs Sri Lanka 2022,India A Vs Sri Lanka A Today Match

గువాహ‌టిలో శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు జరిగిన తొలి వ‌న్డేలో టీమిండియా 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ (83), శుభ్‌మ‌న్ గిల్ (70) శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్ద‌రూ తొలి వికెట్‌కు 143 ప‌రుగులు జోడించారు. అనంతరం క్రీజులోకొచ్చిన టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి సెంచరీతో చెల‌రేగాడు. కేవలం 80 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్స‌ర్‌తో సెంచ‌రీ చేయడం విశేషం. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 45వ‌ సెంచరీ, అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 73వ సెంచ‌రీ. చివ‌ర్లో దూకుడుగా ఆడే క్ర‌మంలో కోహ్లీ (113) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ర‌జిత బౌలింగ్‌లో కీప‌ర్ మెండిస్ క్యాచ్ అదుకోవ‌డంతో అత‌ని అద్భుత ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. అంత‌కుముందు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీలు సాధించారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 373 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక లంక బౌల‌ర్ల‌లో క‌సున్ ర‌జిత మూడు వికెట్లు తీశాడు. మ‌ధుష‌న‌క‌, ధ‌నుంజ‌య‌, ష‌న‌క, క‌రుణ‌ర‌త్నే త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సాధించిన పలు రికార్డులు

  • కోహ్లీకి వన్డేల్లో ఇది 45వ సెంచరీ, అలాగే అంతర్జాతీయంగా 73వ సెంచరీ.
  • సచిన్ (100) తర్వాత 73 శతకాలతో రెండో స్థానంలో కోహ్లీ.
  • కేవలం 257 ఇన్నింగ్స్ ల్లోనే 45 సెంచరీలు సాధించి సచిన్ ను దాటేశాడు.
  • స్వదేశంలో అత్యధిక సెంచరీలు (20) సాధించిన కోహ్లీ సచిన్ సరసన నిలిచాడు.
  • స్వదేశంలో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్, కోహ్లీ తర్వాతి స్థానంలో హషీమ్ ఆమ్లా (14), రికీ పాంటింగ్ (13), రాస్ టేలర్ (12) ఉన్నారు.
  • సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 160 ఇన్నింగ్స్‌లలో 20 వన్డే సెంచరీలు నమోదు చేయగా, కోహ్లీ 99 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు.
  • అలాగే, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు (9) సాధించిన ఆటగాడిగా కోహ్లీ.
  • సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు నమోదు చేయగా, కోహ్లీ విండీస్, శ్రీలంకపై 9 సెంచరీల చొప్పున నమోదు చేశాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here