అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమం, ఏర్పాట్లపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ సమీక్ష

Ministers Talasani Srinivas Mahmood Ali held Review on Kanti Velugu Program in GHMC Office,Kanti Velugu-2 Programme in Telangana,Minister Harish Rao,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 18 నుండి జూన్ 30 వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగు-2 కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జీహెఛ్ఎంసీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు. కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 827 బృందాలను ఏర్పాటు చేయగా, ఇప్పుడు 1500 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి ప్రత్యేకంగా వాహనాలను కూడా సిద్దం చేసినట్లు వివరించారు.

జీహెఛ్ఎంసీపరిధిలోని 91 వార్డులలో 115 శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జీహెఛ్ఎంసీ పరిధిలో శిభిరాల ఏర్పాటు కోసం కమిటీ హాల్స్, మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్, ఇతర ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ గ్రౌండ్ లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిభిరాల వద్ద సరైన పర్నిచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులను కూడా దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 100 పని దినాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిభిరాలు పని చేస్తాయని తెలిపారు. ప్రతి టీంలో ఒక డాక్టర్, ఒక కంటి వైద్యుడు, ఒక పార్మసిస్ట్, ఆశా వర్కర్ లతో కలిపి 10 మంది వరకు ఉంటారని మంత్రి తెలిపారు. ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని, గిన్నీస్ బుక్ లో నమోదయ్యే విధంగా విజయవంతం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కళ్ళద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కంటి ఆపరేషన్ లు అవసరమైన వారికి సరోజినీ దేవి, ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్స్ మాత్రమే కాకుండా లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ఇతర స్వచ్చంద సంస్థల కు చెందిన హాస్పిటల్స్ సేవలను కూడా వినియోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన మందులు అన్ని శిభిరాల వద్ద అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే విజయవంతంగా నిర్వహించబడతాయని అన్నారు. మీ మీ పరిధిలో ఉన్న కార్పొరేటర్ లు, కాలనీలు, బస్తీల కమిటీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని జీహెఛ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కంటి పరీక్ష కోసం 300 నుండి 500 రూపాయల వరకు ఫీజుగా వసూలు చేస్తారని, ఆపరేషన్ కోసం వేల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. పేద, మద్య తరగతి ప్రజల ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం అని, పేద, మద్య తరగతి ప్రజలకు ఒక వారం లాంటిదని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశంసించారు.

ఈ సమావేశంలో జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, కౌసర్ మొహినోద్దిన్, కార్పోరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేష్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కలెక్టర్ అమయ్ కుమార్, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, హెల్త్ అడిషనల్ డైరెక్టర్ పద్మజ, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జీహెఛ్ఎంసీ జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్ లు, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =