ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్‌ ఏర్పాటు

AP Govt Set up Enquiry Commission Over The Incidents of TDP Meetings in Kandukur and Guntur,AP Govt Set up Enquiry Commission,TDP Meetings in Kandukur,TDP Meetings in Guntur,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,AP BJP Party

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరు, గుంటూరు టీడీపీ సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. శనివారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శేషశయనా రెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్‌ను నియమించింది. ఈ మేరకు జీఓ ఎమ్ఎస్ నెంబర్ 7 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 28న కందుకూరులో, అలాగే 2023 జనవరి 1న గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలపై లోతైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా కమిషన్‌ను కోరారు. కాగా వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు తొక్కిసలాటల ఘటనల్లో దాదాపు 11మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ షోలు, ర్యాలీలు చేయకుండా జీఓ నెం.1ను తీసుకొచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + five =