హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం

Himachal Pradesh Assembly Election Results-2022: Grand Victory for Congress Party,Himachal Pradesh Assembly Election Results-2022,Close fight between BJP and Congress,Himachal Pradesh Assembly Election,Himachal Pradesh Election,Himachal Pradesh Election Results,Himachal Pradesh Election Results-2022,Himachal Pradesh Elections,Himachal Pradesh Elections 2022,Himachal Pradesh Elections-2022,Mango News,Mango News Telugu,Himachal Pradesh,Himachal Pradesh Latest News and Updates,Himachal Pradesh Elections News and Live Updates,BJP,Congress,Himachal Pradesh Election BJP,Himachal Pradesh Election Congress

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా అధికారం దక్కించుకోవాలనుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. మూడు దశాబ్దాలకుపైగా ఐదేళ్లకోకసారి అధికారం మార్చే ఆచారాన్ని హిమాచల్ ప్రదేశ్​ ప్రజలు ఈసారి కూడా కొనసాగిస్తూ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాగా ఈసారి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను పార్టీ నేత ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడి, అధికార బీజేపీని నిలువరించింది.

హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ కింద 35 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, కాంగ్రెస్ 40 స్థానాల్లో సత్తా చాటింది. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అధికారాన్ని చేపట్టనుంది. కాగా బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. విస్తృతంగా ప్రచారం చేసి, ఎన్నికల ముందు కొద్దిగా అంచనాలు కలిగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేక పోయింది. అలాగే ఇతరులు 3 స్థానాలు దక్కించుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ, హిమాచల్ ఎన్నికలలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు మరియు నాయకుల కృషి వల్ల ఈ ఫలితం వచ్చిందని, వారికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పార్టీ నేత ప్రియాంక గాంధీ ప్రచారం, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా సహాయపడిందని, సోనియా గాంధీ ఆశీస్సులు తమకు ఉన్నాయని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ అవకాశమిస్తుందనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకుంది.

ఇక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జైరాం ఠాకూర్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరించాడు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తానని, త్వరలో తన రాజీనామాను గవర్నర్ కు అందజేస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ నాయకత్వానికి జైరాం ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. లోపాలను విశ్లేషించి మెరుగుపరుచుకుంటామని,
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని జైరాం ఠాకూర్ పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (గెలుపు)

  • కాంగ్రెస్ : 40
  • బీజేపీ : 25
  • ఇతరులు : 3
  • ఆప్: 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + twelve =