భారత్ vs ఇంగ్లాండ్: 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు షెడ్యూల్ వివరాలు

India vs England: England To Tour India for 4 Tests, 3 ODIs, 5 T20Is From February,India vs England 2021,BCCI Announces Itinerary For England Tour of India,BCCI,India vs England,BCCI,England,India,Mango News,Mango News Telugu,Schedule Of England Tour Of India In February Released,India vs England 2021 Schedule,India vs England 2021 Time Table,India Cricket Schedule 2021,India vs England 2021 Schedule News,India vs England 2021 Dates,India vs England 2021 Venues,India Next Cricket Match Schedule,Ind vs Eng,India vs England Full Schedule,Cricket,Cricket Schedule,India vs England 2021 Test Series Schedule,India vs England 2021 T20I Series Schedule,India vs England 2021 ODI Series Schedule

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో ప‌ర్య‌టించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను గురువారం నాడు బీసీసీఐ ఈసీబీతో కలిసి ఖరారు చేసింది. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత జట్టు 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఇంగ్లండ్‌ తో జ‌రిగే మూడో టెస్టును డే అండ్ నైట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌ను చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదిక‌ల్లో మాత్ర‌మే నిర్వ‌హించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌ షెడ్యూల్ వివరాలు:

టెస్టులు:

  • మొదటి టెస్ట్ – ఫిబ్ర‌వ‌రి 5 నుంచి 9 వ‌ర‌కు – చెన్నై
  • రెండ‌వ టెస్ట్ – ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు – చెన్నై
  • మూడ‌వ టెస్ట్ – ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 28 వ‌ర‌కు – అహ్మ‌దాబాద్‌
  • నాలుగ‌వ టెస్ట్ – మార్చి 4 నుంచి 8 వ‌ర‌కు – అహ్మ‌దాబాద్‌

టీ20లు:

  • మొదటి టీ20 – మార్చి 12 – అహ్మదాబాద్
  • రెండవ టీ20 – మార్చి 14 – అహ్మదాబాద్
  • మూడవ టీ20 – మార్చి 16 – అహ్మదాబాద్
  • నాలుగవ టీ20 – మార్చి 18 – అహ్మదాబాద్
  • ఐదవ టీ20 – మార్చి 20 – అహ్మదాబాద్

వన్డేలు:

  • మొదటి వన్డే – మార్చి 23 – పూణే
  • రెండ‌వ వన్డే – మార్చి 26 – పూణే
  • మూడవ వన్డే – మార్చి 28 – పూణే
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =