జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ

CM YS Jagan Launches Jagananna Jeeva Kranti Scheme Today,All Set For The Launch Of Jagananna Jeeva Kranti Scheme In Andhra Pradesh,Jagananna Jeeva Kranti Scheme,YSRCP President YS Jagan Mohan Reddy,CM YS Jagan Launches Jagananna Jeeva Kranti,AP CM YS Jagan Launches Jagananna Jeeva Kranti Scheme,AP CM YS Jagan,Andhra Pradesh,AP CM YS Jagan Latest NewsYS Jagan Virtually Launches Jagananna Jeeva Kranti Scheme,Jagananna Jeeva Kranti Launch News,Jagananna Jeeva Kranti Launch,Jagananna Jeeva Kranti Launch Event,About Jagananna Jeeva Kranti,Mango News,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా “జగనన్న జీవక్రాంతి” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయంతో గొర్రెలు, మేకలను పంపిణీ చేయనున్నారు. జీవ క్రాంతి పథకాన్ని మొత్తం మూడు విడతలుగా అమలు చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు వ్యవసాయంతో పాటుగా పశువుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ముఖ్యమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు రూ.1868.63 కోట్ల వ్యయంతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే సుమారు రూ.3500 కోట్లతో 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ, ఆర్ధిక వనరులు పెరగాలనే ఉద్దేశంతో ఈ పథకాలు చేపడుతున్నామని అన్నారు. జీవక్రాంతి పథకంలో భాగంగా మొదటి విడతలో మార్చి 2021 వరకు 20 వేల యూనిట్లు, రెండవ విడతలో ఏప్రిల్‌ 2021 నుంచి ఆగస్టు వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడతలో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ 2021 వరకు 99,000 యూనిట్లు పంపిణీ జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =