భారత్ Vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్: తొలి 2 టెస్టులకు 17 మందితో ఇంగ్లాండ్‌ జట్టు ప్రకటన

ENG vs IND 2021, England Announce Their 17 Member Squad, England Announces 17-Member Squad For First Two Tests, England vs India, Ind vs Eng, India tour of England, India tour of England 2021, India vs County Select XI Day 1 highlights, India vs England 2020-21, India vs England 2020-21 Live Cricket Scores, India vs England Test Series, Mango News

భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు టెస్టుల సిరీస్‌ లో మొదటి రెండు టెస్టులకు భారత్ తో తలపడే 17 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) బుధవారం నాడు విడుదల చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గాయపడిన అనంతరం జూన్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లో ఆడని ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులోకి వచ్చాడు. ఆలీ రాబిన్సన్, హసీబ్‌ హమీద్‌, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో మరియు సామ్ కుర్రాన్ కూడా టెస్ట్ జట్టులో స్థానం సంపాదించారు. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు.

ఇంగ్లాండ్‌ జట్టు: జో రూట్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ అండర్సన్‌, బెన్‌స్టోక్స్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జానీ బెయిర్‌స్టో, జాక్‌ లీచ్‌, ఒలీ పోప్‌, డామ్‌ బెస్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ క్రాలీ, సామ్‌ కుర్రాన్, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, ఒలీ రాబిన్సన్‌, డామ్‌ సిబ్లీ, మార్క్‌వుడ్‌.

టెస్టు సిరీస్ వివరాలు:

  • 1వ టెస్ట్: ఆగస్టు 4-8 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్
  • 2వ టెస్ట్: ఆగస్టు 12-16 – లార్డ్స్, లండన్
  • 3వ టెస్ట్: ఆగస్టు 25-29 – ఎమరాల్డ్ హెడింగ్లీ, లీడ్స్
  • 4వ టెస్ట్: సెప్టెంబర్ 2-6 – కియా ఓవల్, లండన్
  • 5వ టెస్ట్: సెప్టెంబర్ 10-14 – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + thirteen =